తిరుమల, ఏప్రిల్ 27 (way2newstv.com)
తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం మహాసంప్రోక్షణ జరిగింది. ఈ కారణంగ ఉదయం 11 గంటల నుంచి ఆలయాన్ని మూసివేసారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఇప్పటికే ఓ ప్రకటనను విడుదల చేశారు. వరాహస్వామివారి ఆలయంలో ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు ఉన్న కర్కాటక లగ్నంలో మహాసంప్రోక్షణ క్రతువును జరిగింది.
వెంకన్న ఆలయంలో మహాసంప్రోక్షణ
అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం, రెండో గంట తదితర పూజాదికాలు నిర్వహించారు. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలో సైతం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాలు జరిగాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసారు.