గుంటూరు, ఏప్రిల్ 15 (way2newstv.com)
టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డొక్కు మాణిక్య వరప్రసాద్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ఈవీఎం మిషన్లు ఎక్కువ శాతం పనిచేయకపోవడమే వైఫల్యానికి కారణం అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే పోరాటం నిజమైనదని అన్నారు.
ఈసీ వైఫల్యం
రాబోయే రోజుల్లో నైనా ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎలక్షన్ కమిషనర్ కు హితవు పలికారు. టీడీపీకి ఓటు బ్యాంకు ఎక్కువశాతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈవీఎం మిషన్లు పనిచేయలేదని అన్నారు. ఈ వైఫల్యం ప్రధాని మోడీ చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ చేసిందని పేర్కొన్నారు. పూర్తిగా ఆంధ్రాలో ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చెందింది అని అన్నారు. మరి వచ్చేది టిడిపి ప్రభుత్వం మరల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.