కౌతాళం, ఏప్రిల్ 29 (way2newstv.com)
కర్నూలు జిల్లా కైతాళం మండల కేంద్రంలో ఎస్ ఐ సురేష్, పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు. ఎస్ ఐ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం వాహనాలను తనిఖీ చేశారు. లైసెన్సులు పాటు వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులను సక్రమంగా ఉండాలన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి
మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడవాలని సూచించారు. ఆటల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారాదని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. పిల్లలతో ద్విచక్ర వాహనాలు నడిపించారదని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అపా రద రుసుముతో పాటు కేసులు నమోదు చేస్తామనీ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. వాహనాల తనిఖీలు లో పోలీస్ సిబ్బంది షఫీ,రామాంజినేయులు,వలీ పాల్గొన్నారు.