అమరావతి, ఏప్రిల్ 30 (way2newstv.com)
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు ముందంజలో ఉండటం గర్వకారణమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అయన ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి దేశవ్యాప్తంగా ఇనుమడింపజేశారని కొనియాడారు.
జేఈఈ విజేతలను అభినందించిన చంద్రబాబు
తొలి 10ర్యాంకుల్లో 3, మొదటి 24 ర్యాంకుల్లో 6 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్ధులే కైవసం చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందాన్ని చంద్రబాబు ట్విట్టర్లో అభినందించారు. నెల్లూరు జిల్లా నర్సాపురానికి చెందిన బట్టేపాటి కార్తికేయ, అనంతపురానికి చెందిన కొండా రేణు, విజయవాడకు చెందిన యెందుకూరి జయంత్ ఫణిసాయి, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బొజ్జా చేతన్ రెడ్డి వరుసగా 5,9,19,21 ర్యాంకులు సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఏటా 30 నుంచి 40 శాతం ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలే ఉండటం అభినందనీయమన్నారు.