తిరుపతి, ఏప్రిల్ 09 (way2newstv.com)
సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉమ్మడి తెలుగు రాప్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుఖసంతోషాలతో పాటు సౌభాగ్యాన్ని ప్రసాదించాలని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్
అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం గవర్నర్ దంపతులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, విఎస్వో అశోక్కుమార్ గౌడ్, ఆలయ ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ మల్లీశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.