జగ్గారెడ్డి పార్టీ మార్పు అనివార్యమా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగ్గారెడ్డి పార్టీ మార్పు అనివార్యమా

మెదక్, మే 1, (way2newstv.com)
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తెలంగాణ రాజకీయలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కారెక్కుతుండడం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదన అగ్గిరాజేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ తీరుపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గులాబీ గూటికి చేరడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు ప్రచారంపై స్వయంగా జగ్గారెడ్డే స్పందించారు. 


జగ్గారెడ్డి పార్టీ మార్పు అనివార్యమా

తాను పార్టీ మారనని..ఇతర పార్టీలోకి రావాల్సిందిగా తనకు ఎలాంటి ఆహ్వానం అందలేని స్పష్టంచేశారు. తాను ప్రజల కోసమే పనిచేస్తానని..కుటుంబం కోసం పార్టీ మారబోనని తేల్చిచెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే తాను నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు. గాంధీ భవన్‌లో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.గతంలో నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అది కూడా తాను ఆశించి వెళ్లలేదేని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలిస్తేనే వెళ్లినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అప్పుడు పార్టీ మారడం వల్ల సంగారెడ్డికి ఎంతో మేలు జరిగిందన్నారు జగ్గారెడ్డి. ఐఐటీ వంటి విద్యాసంస్థలు రావడంతో తమ ప్రాంతంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా ఏం చేసినా..ప్రజల ప్రయోజనాల కోసమే చేస్తానని చెప్పారు