చంద్రబాబే సీఎం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబే సీఎం


విజయవాడ, మే 22, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు ఆ పార్టీ నేత సాధినేని యామిని. వచ్చే టీడీపీ ప్రభుత్వమేనని.. చంద్రబాబు మళ్లీ అధికార పీఠం ఎక్కడం ఖాయమన్నారు. తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని చెప్పడానికి వెయ్యి కారణాలు ఉన్నాయి.. వైసీపీ గెలుస్తుందనడానికి వాళ్ల దగ్గర ఒక్క కారణం కూడా లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయని.. అదే తమ నమ్మకాన్ని పెంచిందన్నారు. 

 చంద్రబాబే సీఎం
కౌంటింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ కార్యకర్తలు అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని యామిని ఆరోపించారు. వైసీపీనే హింసను ప్రేరేపించి టీడీపీపై నెట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఎగ్జిట్ పోల్స్‌ను చూసి సంబరపడుతోందని.. ఆ పార్టీ నేతల ఆశలు కలగానే మిగిలిపోతాయన్నారు టీడీపీ అధికార ప్రతినిధి. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కేంద్రంలో గెలుపు తమదేనంటూ మోదీ సంబరపడుతున్నారని.. ఎన్డీయేకు 200 స్థానాలు కూడా రావంటున్నారు యామిని. 23 తర్వాత మోదీ శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తారని సెటైర్లే పేల్చారు. బీజేపీ ఓడి.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.