విజయవాడ, మే 6, (way2newstv.com)
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సమీపంలో రమణా ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్యసు యానం నుండి హైదరాబాదు వెలుతుండగా ఘటన జరిగింది. బస్సులో వున్న ముప్పై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో పది మంది చిన్నారులు కూడా వున్నారు. అతి వేగమే కారణం అని ప్రయాణికులు ఆరోపించారు.
ట్రావెల్స్ బస్సు..ముఫై మందికి గాయాలు
బస్సు డ్రైవర్ ను క్యాబిన్ లో ఇరుక్కు పోవడంతో దాదాపుగా రెండు విశ్వప్రయత్నం చేసి పోలీసులు బయటకు తీసారు. గతంలో కూడా ఒక ట్రావెల్స్ బస్సు గోతి లో పడిన ఘటన లో 11 మంది మృతి చెందిన వైనం తెలిసిందే. క్షతగాత్రులనునందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సరైన డ్రైవింగ్ శిక్షణ లేని వ్యక్తులను బస్సు డ్రైవర్ లగా నియమించడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తుతుమంత్రంగా తనిఖీలు జరుపుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఇలాంటి ట్రావెల్స్ యాజమాన్యం పై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డియాండ్ చేసారు.