జగ్గంపేట, మే 6, (way2newstv.com)
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట శాసనసభ నియోజకవర్గ జనసేన అభ్యర్థి పాఠం శెట్టి సూర్య చంద్ర జయ అపజయాలతో మాకు పనిలేదని ప్రజల కష్టాలను తీర్చడమే మా జనసేన పార్టీ లక్ష్యమని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నారు.
మామిడాడలో జనసేన స్వచ్ఛ కార్యక్రమం
సోమవారం ఉదయం జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో జన సైనికులతో వార్డు కమిటీ వేసి మార్పు కోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న అన్ని వీధులని చెత్త లేకుండా శుభ్రం చేశారు. చెత్తతో పూడిక పోయిన మురికి కాల్వల ను పూడిక తీసి మురుగు నీరు నిల్వ లేకుండా చేశా. అలాగే బహిరంగ మల విసర్జన చేయరాదని, దుర అలవాట్లనుండి బయటపడాలని గ్రామస్తుల కు అవగాహన కల్పించారు.