రైలు దిగుతుండగా కరెంట్ షాక్.. పలువురికి గాయాలు

గుంటూరు మే 04 (way2newstv.com)
వేజెండ్ల రైల్వే స్టేషన్‌లో రేపల్లె ప్యాసింజర్.. శనివారం షార్ట్ సర్క్యూట్‌కు గురైంది. బోగీలకు విద్యుత్ ప్రవహించడంతో.. రైలు దిగుతున్న ప్రయాణీకులకు కరెంట్ షాక్ తగిలింది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో ప్రయాణీకులు ఫ్లాట్ ఫాం పైకి దూకేశారు. ఈ గందరగోళంలో పలువురు గాయపడ్డారు. 


రైలు దిగుతుండగా కరెంట్ షాక్.. పలువురికి గాయాలు

వెంటనే తేరుకున్న రైల్వే సిబ్బంది.. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు నుంచి తెనాలి మీదుగా ఒంగోలు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని రైల్వే అధికారులు తెలిపారు.
Previous Post Next Post