రాములమ్మ సెకండ్ ఇన్నింగ్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాములమ్మ సెకండ్ ఇన్నింగ్స్


హైద్రాబాద్, జూన్ 3, (way2newstv.com)
శాబ్దానికి పైగా విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తోంది విజయశాంతి. ఒకప్పుడు కథానాయికగా ఒక వెలుగు వెలిగి.. ఆపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటిన విజయశాంతి.. దశాబ్ద కాలంగా రాజకీయాలపైనే దృష్టిపెట్టింది. ఆమే సినిమాలు వద్దనుకుందో.. ఎవరూ సంప్రదించలేదో కానీ.. సినీ పరిశ్రమకు ఆమె పూర్తిగా దూరమైపోయింది. ఐతే సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. అది మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమా కావడంతో రాములమ్మ రీఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో విజయశాంతి పాత్రపై ఆసక్తికర ఊహాగానాలు నడుస్తున్నాయి.రాములమ్మ సెకండ్ ఇన్నింగ్స్
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి నెగెటివ్ రోల్ చేస్తోందని.. ఆమే మెయిన్ విలన్ అంటూ ఒక ప్రచారం నడుస్తుండటం విశేషం. ఐతే ఇంకొందరేమో ఇందులో రాములమ్మ మహేష్‌కు తల్లిగా నటిస్తోందంటున్నారు. కథానాయికగా ఉన్నపుడు కృష్ణకు జోడీగా, మహేష్‌కు తల్లిగా విజయశాంతి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ ఆమె తల్లిగా నటిస్తే భలే ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు మహేష్ ఆర్మీ మేజర్ పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో అతడి ఉన్నతాధికారిగా, మహేష్‌ను ఇన్‌స్పైర్ చేసే పాత్రలో ఆమె నటిస్తోందంటూ ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. మరి వీటిలో ఏది నిజమో.. అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేశాడో.. విజయశాంతి పాత్రపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో