పేద కార్మికులకు ఆర్థిక భరోసా

ఏలూరు, జూన్ 11  (way2newstv.com

మున్సిపల్ పారిశుద్ద్య కార్మికుల వేతనాలను పెంపుదలచేయడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్ది తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది పేద కార్మికులకు ఆర్థిక భరోసా చేకూరిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , వైద్యఆరోగ్యశాఖమంత్రి  ఆళ్లనాని చెప్పారు. జిల్లాలోని మున్సిపల్ పారిశుద్ద్య కార్మికులు, డ్రైవర్ల అసోసియేషన్ నాయకులు మంగళవారం   నానిని దుశ్సాలువలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. 


పేద కార్మికులకు ఆర్థిక భరోసా
పారిశద్ద్య కార్యికులకు నెలకు రు.18 వేల వేతనం ఇచ్చే అంశంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను  ఆళ్లనాని కార్మికులకు వివరించారు. పట్టణాలు, నగరాలలో పారిశుద్ద్యపనులు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆరోగ్యపరిరక్షణకు ఎంతో పాటుపడుతున్న పేద కార్మికులకు సరైన ఆర్థిక బరోసా కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ధ్వేయమని, ఈవిషయంలో ప్రతిఒక్కరికీ ప్రభుత్వం న్యాయంచేస్తుందని  మంత్రి చెప్పారు. ఈకార్యక్రమంలో పారిశుద్ద్య కార్మికులు, డ్రైవర్ల అసోసియేషన్ నాయకులు  అంతర్వేది, శెఖర్ , జివిఎస్ ప్రసాద్, పి .రాజేష్, పెద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post