కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం

విజయవాడ, జూలై 18 (way2newstv.com)
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సభలో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చ, ఆమోదం కోసం గురువారం  కేబినెట్  భేటీ అయింది మొత్తం 12 బిల్లుల్ని ఈసారి సభలో ప్రవేశపెడుతుంది సర్కార్. వీటిలో కొన్ని కొత్త బిల్లులు కాగా... మరికొన్ని చట్ట సవరణ బిల్లులున్నాయి. ఈ 12 బిల్లులకూ కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఆమోదం తెలపింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, నవరత్నాల అమలుకు సంబంధించి కొన్ని చట్టాల్లో సవరణలు చేయబోతోంది ప్రభుత్వం. ముఖ్యంగా ప్రభుత్వ టెండర్లను పారదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ 2001 కి చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలపింది. అలాగే లోకాయుక్త నియామకానికి సంబంధించి హైకోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌ను నియమించే సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 
కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం

కాగా విద్యుత్ నియంత్ర మండలి సిఫార్సుల అమలుకు సంబంధించిన అంశంలోనూ చట్ట సవరణ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఫీజుల నియంత్రణ చట్టంలో సవరణలు తీసుకురానుంది సర్కార్. ఈ బిల్లులోనే విద్యాసంస్థలనియంత్రణ మండలి ఏర్పాటు చేస్తూ సవరణలు చేశారు. దీనిద్వారా ఫీజుల కట్టడితో పాటు ప్రమాణాల పెంపు, వేతనాలు, మౌలికసదుపాయాల కల్పన పర్యవేక్షణ, విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలుచేసేలా బిల్లులో మార్పులు రానున్నాయి అలాగే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే దిశగా మరొక చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేబినెట్ ఆమోదం పొందడంతో అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.కౌలు రైతులకు అండగా ఉంటామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు అనుగుణంగా భూ యజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, పంటపై 11 నెలలపాటు సాగు ఒప్పందం చేసుకునేందుకు వీలు కల్పించేలా మరొక చట్టాన్ని తీసుకురానుంది ప్రభుత్వం. మరోవైపు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందేలా ఉద్దేశించిన బిల్లునూ అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది సర్కార్. దీని ద్వారా ఆయా వర్గాలకు ఈ చట్టం ద్వారా పెద్ద ఎత్తున రాజకీయ ప్రాధాన్యం కల్పించబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేయబోతున్నారు. ఐదు లక్షల లోపు నామినేషన్ వర్క్స్ 50 శాతం కేటాయించే సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది సమగ్ర భూ సర్వే నిర్వహించేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో వైద్యారోగ్యానికి సంబంధించిన సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ప్రభుత్వం జిల్లా ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి కల్పించేలా సొసైటీలు, ట్రస్టుల కిందకు తీసుకువచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ అంగీకరించిందతిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్, పాలక మండలి సభ్యులను ఎప్పుడైనా రీకాల్ చేసే వీలుతోపాటు... రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల పాలకమండళ్ళ రద్దు... ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించేలా హిందూ ధార్మిక చట్టానికి కూడా సవరణ చేపట్టనున్నారు. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం ఓకే చెప్పింది అటు సీఆర్డీఏ అధారిటీ ఛైర్మన్‌గా సీఎంను కాకుండా మరొకరికి అప్పగించేలా కూడా చట్టంలో సవరణలు చేయనుంది సర్కార్.