హైద్రాబాద్, జూలై 18 (way2newstv.com)
బోధనాస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బిల్లును మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల్లో సీట్లు కాపాడుకోవడానికి వైద్యులకు పదవీవిరమణ వయోపరిమితి పెంపు అవసరం అని చెప్పారు.
వైద్యుల పదవీవిరమణ పెంపుకు ఓకే
ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపునకు దేశవ్యాప్తంగా ఉన్న విధానాన్నే అనుసరిస్తున్నాం. మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తాం. ప్రయివేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో త్వరలో మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఉస్మానియా ఆస్పత్రి చారిత్రక వారసత్వ భవనం. ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కూడా మంజూరు చేశాం. ఇప్పుడున్న స్థలంలోనే కొత్త ఆస్పత్రి నిర్మించాలని కొందరు కోరుతున్నారు. కొన్ని నిబంధనల వల్ల పురాతన భవనాలను కూల్చివేయడం సాధ్యం కాదు. ప్రతి భవనాన్ని చారిత్రక భవనం అంటూ కొందరు వితండవాదం చేస్తున్నారు. ప్రతి భవనం చారిత్రక భవనం అయితే.. అభివృద్ధి పనులు సాధ్యం కాదు. హెరిటేజ్ భవనాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Tags:
telangananews