ధీమా ఇవ్వని బీమా (శ్రీకాకుళం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ధీమా ఇవ్వని బీమా (శ్రీకాకుళం)

శ్రీకాకుళం, జూలై 25 (way2newstv.com):  
కష్టం వచ్చినా తట్టుకునేందుకు.. ఆపద చుట్టుముట్టినా ఆదుకునేందుకు.. తేరుకోలేని పరిస్థితి ఎదురయినా ఒడ్డుకు చేరుకునేందుకు ప్రకృతి కన్నెర్రచేసినా...బయటపడేందుకు - అన్నదాతలకో దారుంది. అదే బీమా పథకం.. క్లిష్ట సమయాల్లో.. అదీ తగిన రూపంలో సాయం అందించకపోతే కర్షకుల బాధలు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి. ఓ వైపు ప్రీమియం రూపంలో డబ్బులు ఖర్చవుతున్నా తగిన మేలు జరగకుంటే ఎలా అన్నదే ఆ శ్రమజీవుల ఆవేదన.. 2017-18లో మొత్తం 5.57 లక్షల మంది రైతుల తరఫున బీమా సంస్థకు అందిన ప్రీమియం మొత్తం రూ.230 కోట్లు. అప్పట్లో రైతులు అకాల వర్షాలకు సర్వం కోల్పోతే బీమా సంస్థ చెల్లించిన పరిహారం ఎంతో తెలుసా....? సుమారు పదివేల మందికి రూ.17.65 కోట్లు. 2018-19లో 6.39లక్షల మంది రైతుల నుంచి బీమా సంస్థకు ప్రీమియం రూపంలో అందిన మొత్తం రూ.263.13 కోట్లు. ఆ ఏడాది అక్టోబరులో తిత్లీ తుపాను పంటలను తుడిచిపెట్టేసింది. 
ధీమా ఇవ్వని బీమా (శ్రీకాకుళం)

అప్పుడు బీమా సంస్థ చెల్లించిన పరిహారం ఎంతో తెలుసా..సుమారు రూ.6.50 కోట్లు. గత నాలుగేళ్లలో బీమా సంస్థలు రైతుల తరఫున ప్రీమియం పేరుతో అందుకున్న మొత్తం రూ.958 కోట్లు.. ఇందులో చివరి రెండేళ్లలో చెల్లించిన పరిహారం రూ.24.30 కోట్లు. అంటే.. 2.53శాతం. ఆరుగాలం శ్రమించి సాగు చేసే రైతన్న పంట బాగా పండి మంచి దిగుబడులు రావాలనే కోరుకుంటారు. పంట నష్టం పేరుతో పరిహారాన్ని ఏ రైతూ ఆశించరు. దురదృష్టం వెంటాడి... ప్రకృతి ప్రకోపించి పంటను తుడిచిపెట్టేస్తే బీమా సంస్థ చెల్లించే పరిహారం ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని ఆశిస్తారు.అలా జరగకపోవటమే అన్నదాతలను కలవరపెడుతోంది. సాగు చేసిన విస్తీర్ణంలో యాభై శాతానికి మించి దిగుబడులు నష్టపోతే రైతన్నకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిందే బీమా. ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టపోతే వ్యవసాయశాఖ, బీమా సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాలను అంచనా వేసి పరిహారాన్ని చెల్లిస్తాయి. వీటికి తోడు జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగం చేపట్టే పంట కోత ప్రయోగాల ఫలితాలనూ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. గత మూడేళ్ల సగటు దిగుబడుల కంటే తక్కువ దిగుబడులు వచ్చినా... ఆ మేరకు నష్టపోయిన పంటకూ పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రైతుల నుంచి ప్రీమియం మొత్తాన్ని వసూలు చేయడం, ఆ మొత్తాన్ని బీమా సంస్థకు అందించడం, బీమా సంస్థ ఏదైనా క్లెయిములను పరిష్కరించి పరిహారాన్ని అందిస్తే ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం బ్యాంకులు తమ కర్తవ్యంగా భావిస్తాయి. రుణం తీసుకునే సమయంలోనే రైతు చెల్లించాల్సిన బీమా ప్రీమియంను బ్యాంకులు మినహాయించుకుంటాయి. ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (నఫె్ట్‌) లేదా రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్‌.టి.జి.ఎస్‌).. సూచిక సంఖ్యతో బ్యాంకులు బీమా సంస్థకు మొత్తాన్ని జమ చేస్తాయి. బ్యాంకు, బ్రాంచి, రైతుల వివరాలను అందులో చేరుస్తాయి. ఎంతమంది రైతుల నుంచి ఎన్ని హెక్టార్లకు.. ఎంత రుణం ఇచ్చిందీ.. ఆ మేరకు ఎంత ప్రీమియం వసూలు చేసిందీ.. వివరాలన్నింటినీ పంపిస్తాయి. ఆ సూచిక సంఖ్య ఆధారంగా ఏ బ్యాంకు నుంచి వచ్చింది గుర్తించిన బీమా సంస్థలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మిగిలిన ప్రీమియం సొమ్మును రాబట్టుకుంటాయి. ప్రీమియం చెల్లించే సమయంలో ఇన్ని వివరంగా పంపించినా.. పరిహారం చెల్లింపుల విషయానికి వచ్చే సరికి ఆ వివరాలు లేవు.. ఈ వివరాలు లేవు అంటూ ఎన్నో సందేహాలు లేవనెత్తి కొన్ని బీమా సంస్థలు ముప్పుతిప్పులు పెడుతున్నాయి.‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ కింద రాష్ట్రంలో వివిధ జిల్లాలను ఒక క్లస్టర్‌గా చేర్ఛి. ఆయా జిల్లాలకు బీమా సంస్థలను కేంద్రం ఎంపిక చేస్తుంటుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో శ్రీకాకుళం, కృష్ణ, చిత్తూరు జిల్లాలు ఒక క్లస్టర్‌ కింద ఉన్నాయి. ఈ క్లస్టర్లలోకి పక్కపక్కనే ఉన్న జిల్లాలను చేర్చే అవకాశం ఉండదు. వారి నిబంధనల ప్రకారం...భౌగోళికంగా అక్కడక్కడ ఉన్న జిల్లాలను ర్యాండమ్‌గా ఎంపిక చేస్తుంది. రాష్ట్రాల్లో వివిధ క్లస్టర్ల వారీ బిడ్లు ఆహ్వానించి బీమా సంస్థలను ఎంపిక చేస్తుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రయివేటు సంస్థలు ఇందులో భాగస్వామ్యం అవుతాయి. ఎస్‌.బి.ఐ జనరల్‌ ఇన్సూరెన్సు, అగ్రికల్చరల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌.ఐ.సి నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సహా అనేక సంస్థలు పాల్గొంటాయి. తక్కువ బిడ్‌ వేసిన వారికి.. బాధ్యత అప్పగిస్తారు. ఖరీఫ్‌, రబీలకు వచ్చే సరికి వేర్వేరు బీమా సంస్థలను ఎంపిక చేస్తుంటారు. ప్రస్తుతం మన జిల్లా వరకు ఈ ఖరీఫ్‌లో హర్యానాకు చెందిన ఓ సంస్థ బీమా ప్రీమియం హక్కులు పొందింది. ఇది ప్రయివేటు సంస్థ. వరి మినహా ఇతర పంటలకు అన్నింటికి ఇక ఒక నెల మాత్రమే బీమా గడువుంది.ఈ ఏడాది పంట రుణాల కింద మొత్తం రూ.2,575 కోట్లు అందించాలని జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం ఆమోదించింది. ఇందులో ఖరీఫ్‌లో రూ.1,544కోట్లు.. రబీలో రూ.1,031కోట్ల మేర రుణాలు అందించాల్సి ఉంది. ఈ మొత్తం రుణాలుగా అందిస్తే.. ఇందులో 11శాతం అంటే ప్రీమియం చెల్లించాలి. రైతన్న రూ.లక్ష రుణం తీసుకుంటే.. ఇందులో 4.5 శాతం వంతున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, 2 శాతం నుంచి 4 శాతం వరకు రైతులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. రైతన్న చెల్లించిన ప్రీమియం వరికి రెండు శాతమే. మిర్చి పంటకు 3శాతం, పత్తికి 3.5శాతం, చెరకు 4శాతం రైతు తమ వాటా ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.లక్ష రుణం తీసుకున్నప్పుడు.. నిర్ధిష్ట ప్రీమియం వరికి రూ.11 వేలలో.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.4,500లు చెల్లిస్తే.. మిగిలిన రూ.రెండువేలు రైతు చెల్లించాల్సి ఉంటుంది. రైతు చెల్లించాల్సిన వాటా ప్రీమియం తానే చెల్లిస్తానని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అంటే.. ఈ ఖరీఫ్‌ నుంచి కేంద్రం వాటా రూ.4,500లు పోను.. రైతు చెల్లించాల్సిన మొత్తం రూ.2వేలతో కలిపి.. మొత్తం రూ.6,500ల ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ పంటల్లో లక్ష్యం మేరకు.. రూ.2,575కోట్ల రుణాలను అందించగలిగితే.. ఇందులో 11 శాతం.. రైతు, అతని తరపున కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం రూ.275కోట్ల మేర ప్రీమియం రూపంలో బీమా సంస్థ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.2017 నవంబరులో అకాల వర్షాలకు దాదాపు 28 మండలాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి కలెక్టర్‌ ధనంజయరెడ్డి చొరవ తీసుకుని బీమా సంస్థ ప్రతినిధులను రప్పించి.. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి.. దాదాపుగా 14,568 మంది రైతులకు రూ.34 కోట్ల మేర పరిహారం ఇప్పించేందుకు కార్యాచరణను రూపొందించారు. ఆ సీజన్‌లో బీమా చేయించుకున్న సంస్థ తొలుత రూ.6.18 కోట్ల మేరకు చెల్లించేందుకు సిద్ధమయింది. దానికి ససేమిరా అంటూ కలెక్టర్‌ గట్టిగా పట్టుబట్టడంతో కాస్త దిగొచ్చినా.. పరిహారం మాత్రం 10,400 మందికి.. మొత్తం రూ.17.65కోట్లకే పరిమితం అయింది. వాస్తవానికి అప్పుడు బీమా చేసుకున్న సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందినదే. జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీలోనూ అందిన పరిహారం కేవలం రూ.6.50కోట్లే. ఈ బీమా సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వ రంగానిదే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనా.. ప్రయివేటు బీమా సంస్థలైనా ఆపద కాలంలో రైతుల కన్నీళ్లు తుడవటం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఈసారైనా అలా జరగకుండా ఆదుకోవాలని కర్షకులు విన్నవిస్తున్నా