11 నుంచి 13 వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

11 నుంచి 13 వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు

తిరుమల ఆగస్టు 2, (way2newstv.com)
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4న భక్తులందరికీ వాహనసేవ దర్శనం కల్పించనున్నారు. ఈ నెల 13, 26న వృద్ధులు, 14, 28న చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ నెల 9న తిరుచానూరులో వేడుకగా వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ప్రకటించారు. 
 11 నుంచి 13 వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు

ఈ నెల 11 నుంచి 13 వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 9 నుంచి వారం రోజుల పాటు మన గుడి కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాల్లోని 10 వేల దేవాలయాల్లో మన గుడి కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ నెల 23న గోకులాష్టమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో అస్థానం.. తిరుపతిలో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.