పదేళ్ల తర్వాత పెరిగిన రిజిస్ట్రేషన్ వాల్యు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పదేళ్ల తర్వాత పెరిగిన రిజిస్ట్రేషన్ వాల్యు

విజయవాడ, ఆగస్టు 07, (way2newstv.com)
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పెరిగిన భూములు, స్థలాల ధరలు అమల్లోకి వచ్చినట్లే. ఐదు నుంచి పది శాతం మేర భూములు, స్థలాల మార్కెట్ ధరలు పెంచారు. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఐదు శాతం పెరగగా, పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల్లో పది శాతం వరకు పెరిగింది. ఈ నిర్ణయం ద్వారా రూ.6,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి పెరిగిన రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతుంది. 
పదేళ్ల తర్వాత పెరిగిన రిజిస్ట్రేషన్ వాల్యు

దీంతో ముందురోజు వరకు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు కిక్కిరిసిపోయాయి. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం కొన్నేళ్లుగా పెరగలేదు విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో భూములు, ఆస్తుల రేట్లు భారీగా పెరుగుతాయి. గత కొన్నేళ్లుగా ఏపీలో భూముల మార్కెట్ వ్యాల్యూ పెరగలేదు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ, మార్కెట్ వ్యాల్యూకు సంబంధం లేకుండా పోయినట్లుగా చెబుతున్నారు. దీంతో భూముల నుంచి విల్లాల వరకు బ్లాక్‌లో కొనుగోళ్లు చేశారు. మరోవైపు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం తక్కువగా ఉంది. అమరావతిలో కోట్లు పలికితే రూ.5 లక్షల వ్యాల్యు ఉదాహరణకు రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఎకరా భూమిని రూ.1 కోటి నుంచి రూ.3 కోట్లకు విక్రయించిన సందర్భాల్లో కూడా రిజిస్ట్రేషన్ వ్యాల్యూ రూ.5-7 లక్షలుగా ఉంది. అలాగే, విజయవాడలో ఓ ప్రాంతంలో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు ఉంటే రిజిస్ట్రేషన్ వ్యాల్యూ రూ.15వేలుగా మాత్రమే ఉంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోంది. వ్యాల్యుయేషన్ ఇలా... తగ్గింపు కావాలనుకుంటే ఇలా చేయండి.. పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను పది శాతం వరకు పెంచారు. ఆయా స్థానిక ప్రాంతాల డిమాండును అనుసరించి మార్కెట్ విలువ పెంపుపై జిల్లా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. నగర, పురపాలక సంస్థలు, మేజర్, మైనర్, పంచాయతీల వారిగా పెంపు ఉంది. పదేళ్ల కింది కట్టడం వరకు వ్యాల్యూలో మార్పు లేదు. దాటితే మాత్రం సంవత్సరానికి ఒక శాతం చొప్పున తగ్గింపు ఉంటుంది. గరిష్టంగా 70 శాతం తగ్గింపు ఉంటుంది. తగ్గింపు కావాలనుకుంటే కార్పోరేషన్ లేదా పురపాలక, మేజర్, మైనర్ పంచాయతీ కార్యాలయాల నుంచి పొందిన సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాలి. నిర్మాణాల వ్యాల్యూయేషన్ ఇలా... నిర్మాణాలు - నగరాలు-పట్టణాల్లో గ్రౌండ్ ప్లస్ టు నిర్మాణాలు చ.అ.కు గత ఏడాది రూ.1,030 ఉండగా, ఆగస్ట్ 1వ తేదీ నుంచి రూ.1,100కు పెంచారు. మేజర్ పంచాయతీలో రూ.910 నుంచి రూ.970కి, మైనర్ పంచాయతీలో రూ.650 నుంచి 700కు పెంచారు. నిర్మాణాల వ్యాల్యూయేషన్ ఇలా... అపార్టుమెంట్స్ అపార్టుమెంట్లలో చ.అ.కు ఇదివరకు రూ.1,110గా ఉంది. ఇప్పుడు రూ.1,190కు పెంచారు. మేజర్ పంచాయతీలో రూ.1,030 నుంచి రూ.1,100, మైనర్ పంచాయతీలో రూ.650 నుంచి రూ.770కి పెంచారు. ఎత్తైన భవనాలకు... ఎత్తైన భవనాలకు చ.అ.కు ఇప్పటి వరకు రూ.1,130గా ఉంటే, ఇప్పుడు రూ.1,210గా ఉంది. మేజర్ పంచాయతీలో రూ.1,010గా ఉన్న ధరను రూ.1,080కి, మైనర్ పంచాయతీలో రూ.720గా ఉన్న ధరను రూ.770కు పెంచారు. అమరావతిలో రెండున్నర రెట్లు మట్టి మిద్దెలకు ఇప్పటి వరకు రూ.340గా ఉండగా రూ.360కి పెంచారు. మేజర్ పంచాయతీలో రూ.20 పెంచి రూ.270కి, మైనర్ పంచాయతీల్లో రూ.10 పెంచి రూ.200గా చేశారు. గోడలు కలిగిన పూరిళ్లు వ్యాల్యూ కూడా రూ.10 పెంచారు. చ.అ.కు రూ.160 నుంచి రూ.170కి పెంచారు. మేజర్ పంచాయతీలో రూ.110 నుంచి రూ.110కి, మైనర్ పంచాయతీలో రూ.80 నుంచి రూ.90కి పెంచారు. కోళ్ల ఫారాల నిర్మాణాలకు చ.అ.కు రూ.560 ఉండగా, ఇప్పుడు రూ.600కు పెంచారు. మేజర్ పంచాయతీల్లో రూ.550 నుంచి రూ.590కి, మైనర్ పంచాయతీల్లో రూ.390 నుంచి రూ.420కి పెంచారు. భూముల వ్యాల్యుయేషన్ రాష్ట్రవ్యాప్తంగా 5 నుంచి 10 శాతం పెంచిన ప్రభుత్వం, రాజధాని అమరావతిలో స్క్వేర్ యార్డుకు రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచింది. అంటే రెండున్నర రెట్లు పెరిగినట్లు. గత ప్రభుత్వం భూములను అదే ధరకు (రూ.5,000)కు కేటాయించిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. దేనికి ఎంత శాతం వసూలు చేస్తారంటే.. భూమిని విక్రయించినప్పుడు స్టాంప్ డ్యూటీ కింద ప్రస్తుతం 7.5 శాతం వసూలు చేస్తున్నారు. బహుమతిగా ఇస్తే రెండు శాతం, పార్టిషన్ అయితే ఒక శాతం వసూలు చేస్తున్నారు. మార్కెట్ వ్యాల్యును పెంచినప్పటికీ వీటిని మాత్రం పెంచలేదు. అయితే మార్కెట్ రేటు ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారు. ఆగస్ట్ 1 నుంచి మార్కెట్ వ్యాల్యు పెరుగుతుందని తెలిసి భూములు, అపార్టుమెంట్స్ కొన్నవారు జూలై చివరలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కట్టారు