అమరావతి ఆగస్టు 08,(way2newstv.com):
జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరును జనసేన అధినేత పవన్కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. జూనియర్ డాక్టర్లను కాలితో తన్నడం, చేయి చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతపై ఇలా చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి తగదన్నారు.
వైద్యులపై దాడి చేస్తారా?: పవన్
జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఎన్నో సేవలందిస్తున్నారని, వారి డిమాండ్పై స్పందించకపోగా దాడి చేయడం సబబుకాదన్నారు. ఎన్ఎంసీ బిల్లుపై జూనియర్ డాక్టర్లు, వైద్యులు ఆందోళన చేయడంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ తెలిపారు. విజయవాడ, తిరుపతిల్లో చోటు చేసుకున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టి యువ వైద్యుల్లో, వైద్య విద్యార్థుల్లో స్థైర్యాన్ని నింపాలని ప్రకటనలో కోరారు.
Tags:
Andrapradeshnews