చంద్రబాబు, విజయసాయి మధ్య ట్వీట్స్ వార్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబు, విజయసాయి మధ్య ట్వీట్స్ వార్

విజయవాడ, ఆగస్టు 8  (way2newstv.com):
చంద్రబాబుపై ట్వీట్‌వార్‌లో దూకుడు పెంచారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రోజుకో ట్వీట్‌తో చంద్రబాబు, లోకేష్, టీడీపీపై మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో కౌంటరిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయి మూడు నెలలైనా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గు చేటన్నారు. ‘ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్’అంటూ ఎద్దేవా చేశారు.  ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ?  పాడి ఆవులాంటి  ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. 
చంద్రబాబు, విజయసాయి మధ్య ట్వీట్స్ వార్

ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్.‘అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బిజెపిలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారూ? రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపీలోకి పంపించారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోందా?’అంటూ సెటైర్లు పేల్చారు. అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బిజెపిలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారూ? రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపీలోకి పంపించారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోందా?‘వైఎస్సార్‌ పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభించారు. పట్టుదలతో చేస్తే ప్రాజెక్ట్‌ మూడేళ్లలో పూర్తయ్యేది.7లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్తు తయారయ్యేది.ప్రధాని అన్నట్టు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదు’అంటూ టార్గెట్ చేశారు.  వైఎస్సార్‌ పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభించారు. పట్టుదలతో చేస్తే ప్రాజెక్ట్‌ మూడేళ్లలో పూర్తయ్యేది.7లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్తు తయారయ్యేది.ప్రధాని అన్నట్టు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదు.‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదున్నరేళ్లు వర్షాలకు కొదవ లేదు. జలాశయాలన్నీ నిండి రెండు పంటలు పండాయి. మెట్ట చేలు కూడా కళకళలాడాయి. ఇప్పుడు మళ్లీ రాజన్న రాజ్యం వచ్చింది. రిజర్వాయర్లన్నీ నిండుతున్నాయి. రైతుల మోముల్లో ఒక భరోసా కనిపిస్తోంది’అన్నారు.