ఖాళీ ఎమ్మెల్సీ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖాళీ ఎమ్మెల్సీ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

అమరావతి ఆగస్టు 07,(way2newstv.com):
ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ ఎమ్మెల్సీ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రంలో  ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది.  
ఖాళీ ఎమ్మెల్సీ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నుంచి నామినేన్ల స్వీకరణ వుండగా ఈ నెల 14న నామినేన్లకు తుది గడువు. ఈ నెల 16 న నామినేన్ల పరిశీలన జరుగుతుంది. 19 న నామినేన్ల ఉపసంహరణ గడువు. ఈ నెల 26 ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.