కలెక్టర్ల కాళేశ్వరం పర్యటన

కరీంనగర్, ఆగస్టు 27 (way2newstv.com)
రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు కాశేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పలు జిల్లాల కలెక్టర్లు  వరంగల్‌కు విచ్చేశారు. కాసేపట్లో రెవెన్యుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో హోటల్ హరితలో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. కలెక్టర్లు రాత్రికి వరంగల్‌లోనే బస చేయనున్నారు. 
కలెక్టర్ల కాళేశ్వరం పర్యటన

బుధవారం ఉదయం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా కాళేశ్వరం ముక్తీశ్వరస్వామిని దర్శించుకుకోనున్నారు. అనంతరం కన్నెప్లలి పంప్‌హౌజ్, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లను సందర్శించనున్నారు. బుధవారం సాయంత్రం కాళేశ్వరం పర్యటనను ముగించుకోనున్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు కలెక్టర్లు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు.
Previous Post Next Post