హైద్రాబాద్, ఆగస్టు 27 (way2newstv.com)
దేశానికి మరిన్ని మెడల్స్ అందిస్తానని పీవీ సింధు పేర్కొన్నది. తన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నట్లు ఆమె చెప్పింది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన హైదరబాదీ షట్లర్ పీవీ సింధు సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నది. అభిమానులు ఆశీస్సులు, ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపింది. స్విట్జర్లాండ్‌లోని బాసిల్‌లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సింధు గోల్డ్ మెడల్ కొట్టింది. వరల్డ్ టోర్నీలో పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డు క్రియేట్ చేసింది. ఢిల్లీలో ఉన్న సింధు ఇవాళ ప్రధాని మోదీతో పాటు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజును ఆమె కలుసుకోనున్నది.క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటిన రాష్ట్ర క్రీడాకారులకి ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.
దేశానికి మరిన్ని మెడల్స్
మంగళవారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో క్రీడాకారులు, వారికి లభిస్తున్న ప్రోత్సాహకాల గురించి అధికారులతో చర్చించిన జగన్.. ఇకపై ఏటా ఆగస్టు 29న క్రీడా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించారు. అంతేకాకుండా.. ప్రతిభ చాటిన క్రీడాకారులకి ఏ మేరకు నజరానాలు ఇవ్వాలి..? అనేదానిపై కూడా విస్పష్టమైన సూచనలు చేశారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకి ఇకపై పతక స్థాయి ఆధారంగా విడివిడిగా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. పసిడి పతకం సాధించిన అథ్లెట్‌కి రూ. 5లక్షలు, వెండి గెలిచిన క్రీడాకారులకి రూ.4 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ. 3 లక్షలు నజరానా ఇవ్వనున్నారు. జూనియర్, సబ్ జూనియర్ స్థాయి క్రీడాకారులకి కూడా ఈ ప్రోత్సాహాకాలు లభించనున్నాయి. అయితే.. జూనియర్ స్థాయిలో.. రూ. 1.25 లక్షలు, రూ. 75 వేలు, రూ.50 వేలు రూపంలో పతకం ఆధారంగా క్రీడాకారులకి నగదు అందనుంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారుల్ని గుర్తించి.. పతకాలు ఆధారంగా నగదు అందజేయాలని సీఎం ఆదేశించారు. క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తేనే పీవీ సింధు తరహాలో వెలుగులోకి వస్తారని చెప్పుకొచ్చిన సీఎం జగన్.. ఏటా ఆగస్టు 29 నుంచి వారం రోజుల పాటు క్రీడా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.