సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం జగన్ సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి ఆగస్టు 29, (way2newstv.com)
రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో క్వాలిటీ ఉండాలి, అధికారుల దృష్టి దానిమీద ఉండాలి. అధికారులు క్రమంగా తప్పకుండా వాటిని పరిశీలించండి, తనిఖీలు చేయండి. కనీస సౌకర్యాల ఉన్నాయో లేదో చూడండి. స్కూళ్లకు సంబంధించి 9 రకాల సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. మూడు దశల్లో ఈ సౌకర్యాలను కల్పిస్తున్నారని, అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్లో కూడా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళిక తయారుచేయండని అయన అదేశించారు. మంచాలు, బ్లాంకెట్స్ సహా అన్ని సౌకర్యాలూ హాస్టళ్లలో ఉండాలి, మూడు దశల్లో ఈ పనులు పూర్తికావాలి. 
సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం జగన్ సమీక్ష

హాస్టళ్లలో పిల్లలకు మంచాలు ఉన్నాయా? లేవా? దుప్పట్లు్ల్ట ఉన్నాయా? లేవా? అల్మరాలు ఉన్నాయా? లేదా? వీటన్నింటినీ పరిశీలించి.. ఈ కనీస సదుపాయాలను కల్పించాలి.  పిల్లలను ఏదైనా స్కూలుకు పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో.. ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లుకూడా అలాగే ఉన్నాయో లేదో ఆలోచన చేయాలని అన్నారు. డిమాండు ఉన్నచోట కొత్త హాస్టళ్ల  కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. హాస్టళ్లలో వసతుల సౌకర్యంకోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చారా? లేదా? అన్నదానిపై సీఎం ఆరా, ఇచ్చామని అధికారులు అయన కు సమాధానం ఇచ్చారు.  టాయిలెట్స్ను ప్రతి హాస్టల్లో వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రయార్టీ ప్రకారం చేయాలని సీఎం ఆదేశించారు. 309 హాస్టళ్లలో కుక్స్, వాచ్మన్ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని  ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు తెరిచే సమయానికి యూనిఫారమ్స్, పుస్తకాలు అందాలని అయన అన్నారు.