శ్రీరాంసాగర్‌కు పునరుజ్జీవం..... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీరాంసాగర్‌కు పునరుజ్జీవం.....

నిజామాబాద్, సెప్టెంబబర్ 9, (way2newstv.com)
శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పంపులకు నేడో, రేపో వెట్న్ జరగనుంది. ఇందుకు వీలుగా లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌజ్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. అయితే పూర్తిస్థాయి ఎత్తిపోతలకు కాకుండా, పంపుల డ్రైరన్, వెట్న్‌న్రు మాత్రమే చేస్తున్నారు. వెట్న్ విజయవంతం అయ్యాక ముఖ్యమంత్రి చేతుల మీదుగా పునరుజ్జీవ పథకం పనులు ప్రారంభం కానున్నాయి. సిఎం చేతుల మీదుగానే మరో వారం, పది రోజుల్లో పథకం పనులు ప్రారంభం కావడం ఖాయమే అయినా, అందుకు వీలుగా పంపులను ప్రారంభించాల్సి ఉంది. తొలుత నీటిని పునరుజ్జీవ పథకం పంపులకు నీటిని విడుదల చేసినట్లుగా తెలిసింది. ఈ నీటితో పంపుహౌజ్‌లలోని లీకేజీలు ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తారు.తర్వాత సాంకేతిక, విద్యుత్ సంబంధ పనులు, పంపుల్లో లీకేజీలు, పంపుహౌజ్‌లో లీకేజీలు ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తారు. 
 శ్రీరాంసాగర్‌కు పునరుజ్జీవం.....

అనంతరం పంపులు వెట్ రన్ చేస్తారు. లింక్ 1లో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. కొన్ని చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నా, నీటి తరలింపుకు ఆటంకం లేకుండా సగానికి పైగా పంపులు అన్ని పరీక్షలు పూర్తిచేసుకున్నాయి. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ వరకు నీటిని తరలించే లింక్ 2 ప్రస్తుతం విజయవంతంగా నడుస్తుంది. మిడ్ మానేరుకు ఈ నీరే జలకళ తీగా, ఇప్పుడు లోయర్ మానేరుకు తరలింది. తొలిసారిగా 25 గేట్లు తెరిచి, మిడ్ మానేరు నుంచి నీటిని దిగువకు వదిలారు.వరద కాలువ వరకు ప్యాకేజీ8 గాయత్రి పంపుహౌజ్ ద్వారా చేరిన జలాలను రివర్స్‌లో అదే కాలువపై ఎత్తిపోసే ప్రక్రియను వెట్న్‌త్రో ప్రారంభించనున్నారు. నేడో, రేపో వెట్న్ పూర్తిచేయనున్నారు. ఈ వెట్న్ విజయవంతం అయి,పంపులు నిరంతరం నడిపితే, అప్పుడు నీటి కోసం ఆవురావురు మంటూ ఎదురుచూస్తున్న శ్రీరాంసాగర్ దాహం తీరుతుంది. జలాశయానికి కళ వస్తుంది. ఇందుకోసమే ప్రభుత్వం ఎస్సారెస్పీపునరుజ్జీవన పథకం తీసుకువచ్చింది. రూ. 1,067 కోట్లతో పనులు చేపట్టగా, ఇవన్నీ చివరి దశలో ఉన్నాయి. వరద కాలువ గుండా నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్చేయడానికి వరద కాలువపై మూడు పంపు హౌజ్‌లు నిర్మిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ జీరో పాయింట్ వద్ద గల మూడో పంపు హౌజ్ నిర్మాణ పనులతో సంబంధం లేకుండా మొదటి రెండుపంపు హౌజులతో రోజుకు 0.5 టీఎంసీల నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి తరలించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో 60 రోజుల పాటు 0.5 టీఎంసీల నీటిని తరలిస్తే 30టీఎంసీల నీరు ఎస్సారెస్పీకి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి మరో 30 టీఎంసీల నీరు వచ్చి చేరితే ఖరీఫ్‌లో ఆయకట్టుకు ఢోకా ఉండదు.