పవన్ కు కౌంటరిచ్చిన బొత్స - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పవన్ కు కౌంటరిచ్చిన బొత్స

విజయవాడ, సెప్టెంబర్ 7, (way2newstv.com)
జధాని విషయంలో జనసేన మేధో మథనంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటరిచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచం నుంచి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు బొత్స. మంత్రి ఎలా ఉండాలో ఆయనకు తెలిస్తే చెప్పాలన్నారు. అమరావతిలో రాజధాని వద్దని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారని.. మళ్లీ రాజధాని ఇక్కడే ఉండాలని అంటున్నారని.. ఇదేం పద్దతని విమర్శించారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు బొత్స. ఇతర నిర్మాణాలలాగే అమరావతిని తాత్కాలికంగా ఉంచారని.. గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. ఆయన రాజధాని ఒక అడ్రస్ లేకుండా చేశారని మండిపడ్డారు.రాజధాని వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 
పవన్ కు కౌంటరిచ్చిన బొత్స

మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఎంలా మాట్లాడుతున్నారని.. జగన్ స్పందించకపోతే బొత్స వ్యాఖ్యలనే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామంటే ఒప్పుకునేది లేదన్న జనసేనాని.. ఐదేళ్లు పాటూ పెట్టుబడులు పెట్టాక రాజధానిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు.అమరావతిలో రూ.7వేల కోట్లు పెట్టబడులు పెట్టారని.. ఇలాంటి సమయంలో తరలింపు వార్తలతో ఆందోళన మొదలయ్యిందన్నారు. రాజధానిని మార్చాలని తాను ఎప్పుడూ చెప్పలేదని.. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని మాత్రమే చెప్పానని గుర్తు చేశారు. గ్రీన్‌ క్యాపిటల్ కట్టాలనేదే తమ ఆకాంక్షన్నారు. ఈ వ్యాఖ్యలకే బొత్స కౌంటరిచ్చారు. మీ నాన్నది తుగ్లక్ పాలనఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేయలేని పనులు.. జగన్ 100 రోజుల్లోనే చేయగలిగారన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక జగన్‌పై చంద్రబాబుకు కడుపుమంట పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలన చూసి తట్టుకోలేకపోతున్నారని.. అందుకే ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన బొత్స చంద్రబాబు, లోకేష్‌లపై ఘాటు విమర్శలు చేశారు.ప్రజలకు ఏం చేయలేదని మూర్ఖత్వపు ప్రభుత్వమంటారని ప్రశ్నించారు బొత్స. ప్రజలకు ఏం చేయలేదని విమర్శిస్తున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తుగ్లక్ పాలనంటే చంద్రబాబుదంటూ చురకలంటించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి అర్థరాత్రి మూటా ముల్లు సర్థుకొని పారిపోయి వచ్చింది చంద్రబాబే అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చినవాడు తుగ్లక్ అవుతారా.. లేక జగన్ తుగ్లక్ అవుతారా అంటూ ప్రశ్నించారు. తుగ్లక్ అంటూ పదే పదే విమర్శలు చేస్తున్న వ్యక్తికి దాని అర్థం తెలుసా అన్నారు. ట్విట్టర్‌లో ఏదేదో ట్వీట్ చేసి మేధావి అనుకుంటే ఎలా అంటూ లోకేష్‌పై మండిపడ్డారు.రాష్ట్రం విడిపోకూడదని రాజశేఖర్‌రెడ్డి పోరాడితే.. 2008లో పొలిట్ బ్యూరోలో చర్చించి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా అని మంత్రి ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్టులు, వర్కర్లను పెట్టుకొని రాజకీయాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారని.. మీ ఊబిలో పడి దారి తప్పుతామనుకుంటే పొరపాటన్నారు. టీడీపీ పాలనలో రాజకీయ నాయకులంటే చీదరించుకొని పరిస్థితి తీసుకొచ్చారని.. చింతమనేని, కూన రవిపై కేసులు ఎందుకు పెట్టారో తెలియదా.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ 100 రోజుల్లో టీడీపీ ప్రజల కోసం చేసిన ఒక్క పోరాటం చూపించాలన్నారు.ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు బొత్స. ఇతర నిర్మాణాలలాగే అమరావతిని తాత్కాలికంగా ఉంచారని.. గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. ఆయన రాజధాని ఒక అడ్రస్ లేకుండా చేశారని మండిపడ్డారు. జగన్ ప్రధానిని కలిసిన ప్రతిసారీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నారని.. చంద్రబాబు ప్రధానికి ఇచ్చిన లేఖలో అసలు హోదా ప్రస్తావనే లేదన్నారు.