హైద్రాబాద్, సెప్టెంబర్ 23, (way2newstv.com)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పెద్దగా ఎలాంటి వ్యూహాలు లేకుండానే ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అధికార పార్టీ వైసీపీ నేతల మాట ప్రచారం చెప్పాలంటే.. టీడీపీ ట్రాప్‌లో పవన్మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అధికారంలో ఉండగా.. రాజధాని విషయంలోను, రైతుల విషయంలోనూ పెద్దగా పట్టించుకోని పవన్ కల్యాణ్ ఇప్పుడు మాత్రం వైసీపీ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చి మూడు మాసాలు గడవగానే విమర్శలు ప్రారంభించారు. రాజధాని అమరావతిపై ఐదేళ్ల పాటు గెజిట్ విడుదల చేయని చంద్ర బాబు పైన ఒక్కమాట కూడా అనని పవన్ కళ్యాణ్ఇప్పుడు వంద రోజుల్లో మీరెందుకు విడుదల చేయలేదని జగన్ ప్రశ్నించడాన్ని బట్టి అందరూ కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ ట్రాప్‌లో ఉన్నారని అంటున్నారు ఇదిలా వుంటే, రాష్ట్రంలోని జనసేననుబీజేపీ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా మట్టి రిపించేందుకు ప్రయ త్నిస్తోందని సమాచారం.
జనసేనానికి కమలం గాలం...
గతంలో బీజేపీపైనా మోడీ, వెంకయ్యలపైనా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే,రాజకీయ విమర్శలు కామనే అయినా.. ఏపీలో ఎదగాలని చూస్తున్న బీజేపీ తన పార్టీని నడిపించే కీలక నేతల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి వైసీపీల నుంచి నాయకులను ఏదో ఒక విధంగా లాగేయాలని అనుకున్నా అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు కమల నాథుల కన్ను పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనపై పడిందని అంటున్నారు. ీనికి కూడా ప్రధాన కారణంఉందని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబుకు మరో వ్యాపకం లేదు కాబట్టి కష్టమో నష్టమో.. పార్టీని వచ్చే ఐదేళ్లపాటు అంటిపెట్టుకుని ఉండి ప్రభుత్వంపై పోరాటమో ఆరా టమో చేస్తారు. దీంతోతమ్ముళ్లకు ఒకింత భరోసా ఉంటుంది. ఇక, జనసేన విషయాన్ని తీసుకుంటే.. పవన్ కళ్యాణ్ ఎన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని ముందుకు సాగుతాడో చెప్పలేని పరిస్థితి ఇలా కనిపించి అలాహైదరాబాద్ పయనమయ్యే పవన్ కళ్యాణ్ కు నిలకడ తక్కువనే ప్రచారం కూడా ఉంది.ఇక, వచ్చే ఐదేళ్లపాటు ఆయన సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయంగా యాక్టివ్ గాఉండరు. ఐదేళ్ల పాటు ఖాళీగా ఉండడం ఎందుకని భావిస్తోన్న పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు లాంటి వాళ్లే మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు గతంలో అడ్వాన్స్‌లుఇచ్చిన నిర్మాతల నుంచి కూడా ఇప్పుడు తీవ్రంగా ఒత్తిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటకీ జనసేన క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా ఏ మాత్రం బలంగా లేదు. దీంతో పవన్ కళ్యాణ్ పార్టీలోని కీలకనాయకులు అభద్రతా భావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి బీజేపీ గేలం వేస్తోందని సమాచారం. త్వరలోనే జనసేన ఖాళీ అవుతుందనే ప్రచారం పొలిటికల్ సర్కిళ్లలో హోరెత్తుతోంది. పవన్ మాత్రంతాను జనసేనను ఏ పార్టీలో కలపనని చెపుతున్నా… ఐదేళ్ల పాటు పార్టీని నడిపే పరిస్థితి లేకపోవడంతో ఎప్పుడు ? ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చన్నది తీసిపడేయలేదు