భారీగా తగ్గిన తెలంగాణ పద్దు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారీగా తగ్గిన తెలంగాణ పద్దు

హైద్రాబాద్, సెప్టెంబర్ 9 (way2newstv.com)
తెలంగాణ ప్రగతి పద్దుపై ఆర్థికమాంద్యం ప్రభావం చూపించింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయించిన కేటాయింపుల కన్నా బడ్జెట్ తగ్గింది. ఓటాన్ అకౌంట్‌లో లక్షా 82 వేల 17 కోట్లుగా బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రతిపాదించగా ... పూర్తిస్థాయి బడ్జెట్ 40 వేల కోట్ల వరకు తగ్గింది. దీనికి గల కారణాన్ని సీఎం కేసీఆర్ సభలో వివరించారు. ఆర్థిక మాంద్యం కారణంగా .. ఉన్నది ఉన్నట్టు పద్దు ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు.  మాంద్యం దెబ్బ దేశంలో ఏడాదిన్నర నుంచి ఆర్థిక మాంద్యం కొనసాగుతుంది. దీంతో దేశ స్థూల జాతీయోత్పత్తి క్రమంగా తగ్గిపోతుంది. అమెరికా డాలర్‌తో రుపాయి మారకం విలువ కూడా కనిష్ట స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్ .. తన ప్రగతి పద్దు గురించి మాట్లాడారు.
భారీగా తగ్గిన తెలంగాణ పద్దు

దేశంలో 18 నెలల నుంచి మాంద్యం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో లేనిది ఉన్నట్టు చూపించలేమని .. అందుకే బడ్జెట్ కేటాయింపులు తగ్గించి .. వాస్తవంగా చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదీ పద్దు 2019-2020 ఆర్థిక సంవత్సరానికి లక్ష 46 వేల 492 కోట్లు కేటాయించారు సీఎం కేసీఆర్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో లక్షా 82 వేల 17 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఒకవేళ పరిస్థితి మారి .. ప్రగతిబాట పడితే కేటాయింపులు చేసేలా బడ్జెట్‌లో మార్పులు చేశామని పేర్కొన్నారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం లక్షాల 11 వేల 55 కోట్లు కాగా .. మూలధన వ్యయం 17 వేల 274 కోట్లు అని ప్రకటించారు. ఆర్థిక లోటు 24 వేల 81 కోట్లు అని తెలిపారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతోనే బడ్జెట్ కేటాయింపులు తగ్గించినట్టు పేర్కొన్నారు. కీలక రంగాలకు ప్రధాన అంశాలకు కేటాయింపులు కొనసాగుతాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తామని భరోసానిచ్చారు. ఈ పధకానికి 12 వేల కోట్లు కేటాయించినట్టు వివరించారు. సాగునీటికి 40 వేల కోట్లకు పైగా కేటాయిస్తున్నట్టు తెలిపారు. రైతుబీమా కోసం రూ.1135 కోట్లు ఇస్తామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ఏడాదికి రూ.339 కోట్లు నిధులు అందజేసి .. గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.