నెలకో పధకంతో.. జనాల్లోకి జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నెలకో పధకంతో.. జనాల్లోకి జగన్

హైద్రాబాద్, సెప్టెంబర్ 9 (way2newstv.com)
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టి 100 రోజులు పూర్తయ్యింది. జగన్ వంద రోజుల పాలన.. తుగ్లక్ పాలనలా ఉందంటూ టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. జగన్‌ను ఓ విఫల ముఖ్యమంత్రిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కానీ గతంలో పాలన అనుభవం లేకపోవడంతో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్న జగన్.. ఇక నుంచి ప్రతిపక్షాలతో ఓ ఆటాడుకోనున్నారు. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు జనాలపై సంక్షేమ వరాలు కురిపిస్తూ.. విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందుకెళ్లనున్నారు.నవరత్నాలు అందిస్తామని మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొన్న జగన్.. అధికారంలోకి వచ్చాక.. వాటిని అమలు చేసే ప్రయత్నం ప్రారంభించారు. 
నెలకో పధకంతో.. జనాల్లోకి జగన్

ఇప్పటికే నాణ్యమైన బియ్యాన్ని అందజేసే పథకాన్ని ప్రారంభించారు. పాదయాత్ర సందర్భంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని మాటిచ్చిన జగన్.. సెప్టెంబర్‌ చివరి వారంలో వారికి డబ్బులు ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 10 నుంచి దీనికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతోంది. సొంత ఆటో, క్యాబ్‌ను నడిపేవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం వర్తించనుంది.ఇక అది మొదలు.. ప్రతినెలా ఏదో ఓరకంగా, ఏదో ఒక వర్గానికి ఆర్థిక చేయూత అందేలా జగన్ సర్కారు ప్రణాళికలు రూపొందించింది. అక్టోబర్‌ 15న జగన్ సర్కారు రైతు భరోసాను అందజేయనుంది. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 అందజేయనున్నారు.మరుసటి నెలలో మత్స్యకారులకు జగన్ ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించనుంది. నవంబర్‌ 21న ప్రపంచ మత్య్స దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు రూ.10 వేలు ఇవ్వనున్నారు. మత్స్యకారులకు డిజీల్ సబ్సిబీ ప్రస్తుతం రూ.6 ఇస్తుండగా.. దాన్ని రూ.9కి పెంచనున్నారు.డిసెంబర్లో.. ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అమ్మఒడిని ప్రారంభిస్తారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ రూ.15 వేలు అందజేయనున్నారు. ఈ పథకంపై విపక్ష నేతలు సైతం ప్రశంసలు గుప్పిస్తుండటం గమనార్హం.