క్యాడర్ లో ధైర్యం నిలిపిన టీడీపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

క్యాడర్ లో ధైర్యం నిలిపిన టీడీపీ

విజయవాడ, సెప్టెంబర్ 12, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తల్లో ధైర్యం నింపడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ నైరాశ్యంలో మునిగిపోయింది. ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన పార్టీ క్యాడర్ పవర్ దూరమవ్వడాన్ని తట్టుకోలేకపోతోంది. తాము అధికారంలో ఉండగా వైసీపీ క్యాడర్ పై పెట్టిన అక్రమ కేసులు గుర్తొచ్చి కొన్ని ప్రాంతాల్లో వారంతట వారే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి.ప్రధానంగా అనంతపురం జిల్లాలోని రాప్తాడు, ధర్మవరం, కల్యాణదుర్గం, గుంటూరు జిల్లాలోని గురజాల, మాచర్ల, వినుకొండ తదితర ప్రాంతాల్లోనూ గతంలో ఆధిపత్యం చెలాయించిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు గ్రామాలకు దూరంగా ఉంటున్నాయి. 
క్యాడర్ లో ధైర్యం నిలిపిన  టీడీపీ

అయితే తాజాగా చంద్రబాబు నాయుడు ఎత్తుకున్న పల్నాడు అంశం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ లో కొంత ఉత్సాహం నెలకొల్పిందనే చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ బాధితులు అంశాన్ని చంద్రబాబు హైలెట్ చేవారు. వైసీపీ బాధితుల కోసం ప్రత్యేకంగా గుంటూరు శిబిరాలను ఏర్పాటు చేసి రోజుకొక నేతను అక్కడికి పంపి ఈష్యూ తేలిపోకుండా వారం రోజుల నుంచి చూడగలిగారు.నిజానికి వైసీపీ బాధితుల పునరావాస కేంద్రం కేవలం కొద్దిరోజుల పాటు ఏర్పాటు చేసిందే. అయితే చంద్రబాబుకు నేతలు ఎదుర్కొంటున్న కేసుల భయం పట్టుకుంది. పల్నాడు ప్రాంతంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు వంటి నేతలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇద్దరిని బహిరంగంగా వెనకేసుకొచ్చే పరిస్థితి చంద్రబాబుకు లేదు. న్యాయపరంగా, కేసుల పరంగా ఈ ఇద్దరు నేతలు ఎదుర్కొంటున్న ఆరోపణలు తేలిగ్గా ఎవరూ కొట్టిపారేయలేరు. అలాగే చింతమనేని శ్రీనివాసరావుపైనా కేసులు నమోదవుతున్నాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై భూ కబ్జా కసు నమోదయింది.ఇలా టీడీపీ సీనియర్ నేతలను టార్గెట్ చేయడంతో చంద్రబాబుతో కలవరం మొదలయింది. భవిష్యత్తులో మరికొందరు నేతలు కూడా కేసుల్లో చిక్కుకునే అవకాశముందని భావించిన చంద్రబాబు వైసీపీ బాధితుల పునరావాస కేంద్రం పేరుతో గత పదిహేను రోజులుగా చేస్తున్న ఆందోళనతో ఆయన పార్టీలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. క్యాడర్ వెంట చంద్రబాబు ఉన్నారన్న ధైర్యాన్ని పంపగలిగారు. చంద్రబాబు పల్నాడు అంశాన్ని బాగా ఫోకస్ చేసిన తర్వాత అఖిలప్రియ వంటి నేతలు మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు పల్నాడు అంశంలో చంద్రబాబు విజయవంతం అయ్యారనే చెప్పాలి.