అమిత్ షాతో మమత బెనర్జీ భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమిత్ షాతో మమత బెనర్జీ భేటీ

న్యూఢిల్లీ సెప్టెంబర్ 19 (way2newstv.com)
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం  ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అస్సాంలో చేపట్టిన ఎన్ఆర్సీ గురించి కేంద్ర మంత్రితో సీఎం బెనర్జీ చర్చించారు.  బెంగాల్లో ఎన్ఆర్సీ చేపట్టాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. అస్సాంలో 19 లక్షల మందిని పౌరుల జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే.  ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కనివారిలో హిందీ, బెంగాలీ, అస్సామీ మాట్లాడే స్థానికులు ఉన్నారన్నారు. 
అమిత్ షాతో మమత బెనర్జీ భేటీ

నిజమైన ఓటర్లను కూడా కోల్పోయామన్నారు.  దీనికి సంబంధించి షాకు లేఖ అందజేసినట్లు దీదీ తెలిపారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. అమిత్ షా కు ఇచ్చిన లేఖలో ఆర్హుల పేర్లు గల్లంతయ్యాయని పేర్కోన్నారు. దీన్ని సరిచేయాలని సూచించినట్లు ఆమె అన్నారు. బుధవారం దీదీ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, ప్రధానితో ఆమె కేవలం శాఖపరమైన చర్చలు జరిపారు. ఎన్ఆర్సీ అంశం చర్చకు రాలేదు.