ఇవాళ్టి నుంచి పూర్తిగా అక్కడి నుంచే విధులు
హైద్రాబాద్, సెప్టెంబర్ 5, (way2newstv.com)
పాత సచివాలయం పూర్తిగా ఖాళీ అయినట్టే. ఇందులోని అన్ని శాఖలు ఇప్పటికే వివిధ కార్యాలయాలకు తరలిపోగా చివరగా మిగిలిన ముఖ్యమంత్రి కార్యాలయం కూడా బేగంపేటలోని మెట్రోరైలు భవనంలోకి తరలిపోయింది. ముఖ్యమైన శాఖలన్నీ తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలిపోవడంతో శుక్రవారం నుంచి ఉద్యోగులు కూడా ఇక్కడి నుంచే విధులు నిర్వహించనున్నారు. ఈ నెల 6 నుంచి ఉద్యోగులను బీఆర్‌కే భవన్‌కే హాజరుకావాల్సిందిగా సాధారణ పరిపాలనాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఉండగా బీఆర్‌కే భవన్‌లో తొమ్మిది అంతస్తుల్లో ఏర్పాటు చేసిన శాఖల వివరాలు ఇలాఉన్నాయి. 9వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ప్రోటోకాల్ మరియు పొలిటికల్) కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
సచివాలయం ఖాళీ... సంపూర్ణం
8వ అంతస్తులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, ప్రణాళిక, న్యాయశాఖ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 7వ అంతస్తుంలో విద్యుత్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోంశాఖ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, అంతరాష్ట్ర సంబంధాల సలహాదారు కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 6వ అంతస్తులో నీటిపారుదలశాఖ ముఖ్యి కార్యిదర్శి, పర్యాటక, సాంస్కృతికశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 5వ అంతస్తులో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ ముఖ్యి కార్యదర్శి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 4వ అంతస్తులో రెవెన్యూ, దేవాదాయ, వాణిజ్య పన్నులశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాలు, విద్యాశాఖ కార్యదర్శి కార్యాలయం. 3వ అంతస్తులో మున్సిపల్ పరిపాలనా, పశుసంవర్ధకశాఖ, ఎస్సీ, ఎస్టీ,బీసీ సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శుల కార్యాలయాలు, 2వ అంతస్తులో ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలు, ఐటీ అండ్ బీఎస్‌ఎన్‌ఎల్ కేంద్రాలు, సెంట్రల్ రికార్డు బ్రాంచి కార్యాలయాలు, మొదటి అంతస్తులో మంత్రుల కార్యాలయాలను ఏర్పాటు చేశారు.