యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో.. బ్యానర్‌పై టి.సంతోష్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ `అర్జున్ సురవరం`. దీపావళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంది.
నవంబర్ 29న నిఖిల్ `అర్జున్ సురవరం`
ఈ నిరీక్షణకు తెరపడింది. నవంబర్ 29న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి జంటగా నటించింది. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.నటీనటులు: నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్ తదితరులు