ప్రశాంత్ కిషోర్ తో రజనీ, కమల్ భేటీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రశాంత్ కిషోర్ తో రజనీ, కమల్ భేటీలు

చెన్నై, అక్టోబరు 2, (way2newstv.com)
తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం మొదలుకాబోతుందా..? తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ కోసం భారీ వ్యూహం తో పొలిటికల్ తెరపై తన అదృష్టం పరీక్షించుకొనున్నారా ? అవుననే సంకేతాలు ఆయన చర్యలు చెప్పక చెబుతున్నాయి. అదిగో ఇదిగో అంటూ తన పొలిటికల్ ఎంట్రీ ని వాయిదా లు వేస్తూ వస్తున్న రజనీకాంత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కసరత్తు తెరవెనుక వేగవంతం చేసినట్లే కనిపిస్తుంది. తమిళనాడులో జయలలిత శకం ముగిశాక రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ఖాయం అనే అంతా భావించారు. తలైవార్ కూడా తదనుగుణంగా అడుగులు కదిపారు కూడా.అయితే ఆయానకన్నా ముందుగా కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. 
ప్రశాంత్ కిషోర్ తో రజనీ, కమల్ భేటీలు

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పోటీ చేసింది కమల్ మక్కల్ నీది మయ్యం. అయితే ఆ పార్టీకి ఒక్క సీటు దక్కకపోయినా కొన్ని స్థానాల్లో బలంగా ఓట్లు కొల్లగొట్టింది. దాంతో కమల్ పార్టీ వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మక అడుగులు వేస్తే రాజకీయంగా బలమైన ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఇటీవల కమల్ దేశంలో ప్రఖ్యాత వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలిసి కమల్ సంప్రదించి ఆయన ఇచ్చిన సూచనలతో పార్టీలో మార్పు చేర్పులు చేసినట్టు ప్రచారం నడిచింది.తాజాగా రజనీకాంత్ ప్రశాంత్ కిషోర్ ల భేటి మరో రాజకీయ సంచలనం అయ్యింది. రజనీ తప్పనిసరిగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే సంకేతాలు వీరి భేటి తరువాత బలపడ్డాయి. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజనీ పొలిటికల్ ఎంట్రీ తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందని అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ రాక డీఎంకే విజయవకాశాలను దెబ్బ కొడుతుందా లేక అన్నా డిఎంకె ను దెబ్బతీస్తుందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే తన అభిమాన సంఘాలతో నియోజక వర్గాల వారిగా జిల్లాల వారిగా తమిళనాడులో రజనికాంంత్ నెట్ వర్క్ బలంగా తయారు చేసుకున్నారు. ఈ నేపధ్యం లొనే ఆయన ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అయ్యి రాజకీయ వ్యూహాల కోసం సంప్రదించినట్లు తలైవార్ అభిమానుల టాక్.