మళ్లీ బీజేపీ వైపు చంద్రబాబు చూపు! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ బీజేపీ వైపు చంద్రబాబు చూపు!

విజయవాడ అక్టోబర్ 1  (way2newstv.com)
ఏపీ ప్రత్యేక హోదా వివాదంతో కేంద్రంలోని ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఆ తరువాత అధికారం కోల్పోయిన టీడీపీ అథినేత నారా చంద్రబాబునాయుడు మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకున్న తరువాత మళ్లీ కేంద్రంలోని బీజేపీ వైపు చూస్తున్నారని రాజకీయవర్గాల్లో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అందుకు ఊతమిచ్చేలా బలమైనఆధారాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జగన్ ను ఎదుర్కోవడం కష్టంగా మారడం.. మరోవైపు బీజేపీ కూడా కమ్ముకొస్తుండడంతో ముందుజాగ్రత్తగా ఆయన బీజేపీతో కలిసి మళ్లీ పోటీ
చేయాలని.. అప్పుడు తనకు ఇద్దరు శత్రువులు లేకుండా కేవలం ఒక్క వైసీపీతో మాత్రమే పోటీ పడితే సరిపోతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 
మళ్లీ బీజేపీ వైపు చంద్రబాబు చూపు!

ఆ క్రమంలోనే బీజేపీకిదగ్గరయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు చేసిన తాజా ట్వీట్ ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఇది రివర్స్ డెవలప్ మెంట్ ప్రభుత్వం. అందుకేకరెంట్ కోతలు. కేంద్రం తోడ్పాటుతో - తెదేపా ప్రభుత్వం తెచ్చిన నిరంతర విద్యుత్ ను కూడా రివర్స్ చేసారు. 9 గంటల విద్యుత్ అన్నారు. అందులో సగం కోసేశారు. పీపీఏలనుమూర్ఖంగా రద్దుచేసిన దుష్ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారం’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ంలో విద్యుత్ కోతలపై ఆయన ట్వీట్ చేసినట్లుగాకనిపిస్తున్నా అందులో ఆయన కేంద్రం సహకారంతోనే తన హయాంలో 24 గంటల విద్యుత్ ఇవ్వగలిగానని ఒప్పుకొన్న విషయం గుర్తించాల్సి ఉంది.అధికారంలో ఉన్నప్పుడు కేంద్రప్రభుత్వ పథకాలను కూడా తన ఘనతగా మార్చి చెప్పుకొన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రం సహకారం గురించి మాట్లాడడం వెనుక కారణం బీజేపీతో మైత్రి ప్రయత్నాలేనని అంటున్నారు.నిజానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్ పథకం విషయంలోనూ కేంద్రం పేరు ఎక్కడా వినిపించకుండా జాగ్రత్తపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరాపథకం కింద ఏపీని ఎంపిక చేయడంతో కోతలు లేకుండా పోయాయి. కానీ ఐదేళ్లలో ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ వల్లే నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నా మని చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు పనిగట్టుకుని కేంద్రం సహకారాన్ని ప్రస్తావించడం వెనుక బీజేపీని దువ్వడం ఒక కారణమైతే.. రెండో కారణం ఒకవేళ వైసీపీ ప్రబుత్వంపరిస్తితులను చక్కదిద్దినా అది కేంద్రం వల్లే అన్న మెసేజ్ పంపడం మరో కారనం.