సుజనా వాయిస్ పెంచుతున్నారే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సుజనా వాయిస్ పెంచుతున్నారే...

విజయవాడ, అక్టోబరు 25, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగి ఎన్నికల ఫలితాల తరువాత దుకాణం మూసేసి బిజెపి లో ఖాతా తెరిచిన మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి దూకుడు పెంచారు. అమరావతి రాజధాని మార్పు, ఆ తరువాత పోలవరం అంశాలపై వరుసగా వైసిపి సర్కార్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఆయన కొంతకాలం మౌనం వహించారు. రాజధానిలో సుజనా చౌదరికి భూములు వున్నాయంటూ వైసిపి ఎదురుదాడికి దిగడంతో కొంత రగడ అనంతరం మీడియా కు ముఖం చాటేశారు సుజనా. అయితే తాజాగా అయన మరోసారి తన వ్యాఖ్యలతో ప్రచారంలోకి వచ్చారు. ఈసారి ఆయన పంథా మార్చారు. ఒక్క వైసిపి ని టార్గెట్ చేయడం ద్వారా అధిష్టానం దృష్టి లో మైనస్ లో పడ్డ మాజీమంత్రి సుజనా చౌదరి ఈసారి నేరుగా టిడిపి ని కూడా సమపాళ్ళలో విమర్శించడం ద్వారా తాను పార్టీ విధేయుడిననే అంశం చాటేందుకు ప్రయత్నం చేశారు.
సుజనా  వాయిస్ పెంచుతున్నారే...

ఎంతోకాలం చంద్రబాబు కి కుడి భుజంగా వ్యవహరించిన సుజనా చౌదరి టిడిపి రాష్ట్రానికి పట్టిన పీడ అంటున్నారు. పనిలో పనిగా వైసిపి కూడా అదే అని కితాబునిచ్చారు. ఈ రెండు ప్రాంతీయపార్టీలు కుటుంబ పార్టీలని సుజనా చౌదరికి ఇప్పుడు సడెన్ గా గుర్తుకు వచ్చేసింది. జాతీయ పార్టీ బిజెపి మాత్రమే దేశానికి శ్రీరామ రక్ష అంటూ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కమలం తీర్ధం పుచ్చుకున్న సందర్భంలో వ్యాఖ్యానించడం విశేషం.ఇటీవల కాలంలో బిజెపి నేతలు టిడిపి ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఉతికేస్తున్నా పసుపు పార్టీ అధినేత నుంచి కింది స్థాయి వరకు నేతలు ఆ పార్టీని విమర్శించే సాహసానికి ఒడిగట్టడం లేదు. ఎన్నికల ముందు బిజెపి ని ముఖ్యంగా మోడీ ని విలన్ గా అభివర్ణిస్తూ జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు అండ్ టీం ఈవిధంగా మౌన ముద్ర లో ఉండటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీస్తుంది. స్వయంగా తమ దగ్గర నుంచే వెళ్ళిన సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటి వారే కుటుంబ పార్టీలు అవినీతి అక్రమాలకు నిలయాలంటూ ఎద్దేవా చేస్తున్నా టిడిపి నేతలు మాట్లాడకపోవడం భవిష్యత్తులో ఆ పార్టీకి మరింత నష్టం తెచ్చేదే అన్న ఆందోళన తమ్ముళ్లలో కనిపిస్తుంది.టిడిపి కి డోర్లు మూసేశామని బిజెపి రాష్ట్ర నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. మోడీ, అమిత్ షా లు ఈ అంశంలో పూర్తి క్లారిటీ తో వున్నారని ఎపి బిజెపి ఇంచార్జ్ సునీల్ దేవధర్ వంటివారు పదేపదే చెబుతున్నారు. అయినా కానీ సుజనా చౌదరి వంటివారు చేసే లాబీయింగ్ తో వచ్చే ఎన్నికల్లోపు బిజెపి తో దోస్తీ కుదరక పోతుందా అని టిడిపి ఆశపడుతుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈనేపథ్యంలోనే సుజనా చౌదరి టిడిపి పై కూడా డోస్ పెంచడం వెనుక అనేక రీజన్స్ ఉన్నాయని విశ్లేషకుల అంచనా. పార్టీ అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగా సుజనా చౌదరి సైతం ప్రస్తుత దశలో వెళ్ళక తప్పడం లేదన్నది తాజాగా సుజనా వ్యాఖ్యలు చెప్పక చెబుతున్నాయని విశ్లేషిస్తున్నారు రాజకీయ అనుభవజ్ఞులు