ఫిట్ నెస్ లేని బస్సులతో ఎలా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫిట్ నెస్ లేని బస్సులతో ఎలా

హైద్రాబాద్, అక్టోబరు 16, (way2newstv.com)
బస్సు టైర్లలో గాలుందా? వీల్‌‌‌‌ బోల్టులు మంచిగనే ఉన్నయా? బ్రేకులు సక్కగ పడుతున్నయా, లేదా? స్టీరింగ్‌‌‌‌ ఫ్రీగనే తిరుగుతోందా? తేడా కొడుతోందా? ఇంజిన్‌‌‌‌ పరిస్థితేంటి? గేర్ల సంగతేంది? ఆర్టీసీ బస్సు డిపో నుంచి బయటికొచ్చే ముందు ప్రతిరోజూ ఇన్ని చెకింగ్‌‌‌‌లుంటాయి. బస్సును మెకానిక్‌‌‌‌ ఓకే చేశాకే డ్రైవర్‌‌‌‌ అందుకుంటాడు. కానీ సమ్మె ఎఫెక్ట్‌‌‌‌తో ఏ డిపోలోనూ మెకానిక్‌లు అందుబాటులో లేరు. దరఖాస్తులు ఆహ్వానించినా ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో పది రోజులు దాటినా బస్సుల కనీస నిర్వహణే లేదు. ఇప్పటికే స్టీరింగ్‌‌‌‌ సక్కగ తిరగక, బ్రేకులు పడక, టైర్లు ఊడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకొన్ని రోజులు బస్సులు ఇట్లే నడిస్తే పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారుడిపో గ్యారేజీలో వివిధ విభాగాల్లో సూపర్ వైజర్ల పర్యవేక్షణలో మెకానిక్‌‌‌‌లు, శ్రామిక్‌‌‌‌లు పని చేస్తుంటారు. 
ఫిట్ నెస్ లేని బస్సులతో ఎలా

బస్సు 350 కిలోమీటర్లు తిరిగాక బస్‌‌‌‌ లాగ్ బుక్‌‌‌‌లో డ్రైవర్ నమోదు చేసే సమస్యలను మెకానిక్‌‌‌‌లు చూసి బస్సును బాగు చేస్తారు. బ్రేకులు, లైనర్లు, ఎయిర్ లీకేజీ, రేడియేటర్‌‌‌‌లో వాటర్, ఇంజిన్, గేర్ బాక్స్‌‌‌‌ ఇలా 45 నిమిషాల పాటు బస్సును చెక్‌‌‌‌ చేస్తారు. ట్రయల్ రన్ చేసి ఓకే చేస్తారు. తర్వాతి రోజుకు సిద్ధంగా ఉంచుతారు. కానీ సమ్మె ఎఫెక్ట్‌‌‌‌తో ఆదరబాదరాగా రోడ్లపైకి వస్తున్న బస్సుల టైర్లలో కనీసం గాలి ఎంతుందని చెక్ చేసే వాళ్లూ కరువయ్యారు. మిగతా నిర్వహణ సంగతి చెప్పక్కర్లేదు. మోటార్ వెహికల్ ఇన్స్‌‌‌‌పెక్టర్ సమక్షంలో బస్సును ఓ రౌండ్ తిప్పి ట్రయల్ రన్‌‌‌‌ అయిపోయిందని టెంపరరీ డ్రైవర్లకు అప్పగిస్తున్నారు. డిపోల్లో మెకానిక్‌‌‌‌ల కింద పని చేయాల్సిన శ్రామిక్ పోస్టుల భర్తీని ఎన్నడో నిలిపేశారు. ఐటీఐ కోర్సు అప్రెంటిస్ షిప్ కింద వచ్చే వారితో చాకిరీ చేయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో 500 మెకానిక్‌‌‌‌లు, వెయ్యి శ్రామిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీనియర్ మెకానిక్ మధుమోహన్ చెప్పారు. దీంతో అసలే డొక్కు బస్సులు, పైగా మెకానికల్‌‌‌‌ నిర్వహణ లోపంతో ఉన్న వాటిని రవాణాకు వాడుతున్నారు. యాంత్రిక నిర్వహణ లోపాలు ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తాయో గత అనుభవాలు గుర్తు చేస్తున్నా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఫిట్‌‌‌‌నెస్ లేని బస్సులను కనీస నిర్వహణ లేకుండా వాడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. కార్మికుల డిమాండ్లలో పరిష్కారమయ్యే వాటిని పట్టించు కోకుండానష్టాలకు వాళ్లే బాధ్యులన్నట్లు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నంజరుగుతోందంటున్నారు.12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను తుక్కు కింద పరిగణించాలి. కానీ 15 నుంచి 18 లక్షల కిలోమీటర్లు తిరిగినా రవాణాకు వాడుతున్నారు. ప్రతి డిపోలో సుమారు 25 నుంచి 35 వరకు కాలం చెల్లిన బస్సులు నడుస్తున్నట్లు తెలిసింది. నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలోని 4 డిపోల్లో కాలం చెల్లిన బస్సులు దాదాపు 120 వరకు ఉన్నాయని సమాచారం. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10,500 ఆర్టీసీ బస్సులుంటే వీటిల్లో దాదాపు 6 వేల బస్సులు 12 లక్షల కిలోమీటర్లకు పైబడి తిరిగినవే. వీటి స్థానంలో కొత్త బస్సులు రావాల్సి ఉన్నా పాత వాటితోనే కానిచ్చేస్తున్నారు. లేదంటే ప్రైవేట్ బస్సులకు ద్వారాలు తెరుస్తున్నారురోజువారీ పద్ధతిలో పని చేయడానికి మెకానిక్‌‌‌‌లు దరఖాస్తు చేసుకోవాలని డీపీఆర్‌‌‌‌వోల ద్వారా సమ్మె మొదలైన 5 రోజుల తర్వాత ప్రకటన ఇప్పించారు. మెకానిక్‌‌‌‌కు రోజుకు రూ.1,500, అసిస్టెంట్లకు రూ.1,000 ఇస్తామన్నారు. కానీ సమ్మె స్టార్టయి 9 రోజులవుతున్నా ఏ డిపోలోనూ తాత్కాలిక మెకానిక్‌‌‌‌ల నియామకం జరగలేదు. అసలు ఒక్కరంటే ఒక్కరూ జాయిన్‌‌‌‌ కాలేదు. దీంతో కనీసం గ్యారెంటీ లేని బస్సులను తాత్కాలిక డ్రైవర్లకు అప్పగించి రోడ్ల మీదికి వదులుతున్నారు. ఇప్పటికే ఏడాదిగా  ఆర్టీసీ యాజమాన్యం డిపోలకు విడిభాగాల సరఫరా నిలిపేసింది. దీంతో రెగ్యులర్‌‌‌‌ బస్సులకు విడిభాగాలు అవసరమైనప్పుడు ఫెయిలై మూలనపడిన బస్సుల భాగాలు తీసి వేస్తున్నరు.