మెగా బతుకమ్మకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మెగా బతుకమ్మకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి

 జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి  అక్టోబర్ 01 (way2newstv.com)
బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ నెల 2వ తేదీన వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని నల్లచెరువు ట్యాంకుబండ్ పై నిర్వహిస్తున్న మెగా బతుకమ్మ ఉత్సవాలలో జిల్లా ప్రజలు పెద్దఎత్తునపాల్గొనాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కోరారు.మంగళవారం ఆమె జిల్లా ఎస్పీ అపూర్వ రావు తో కలిసి నల్లచెరువు ట్యాంక్ బండ్ పై  మెగా బతుకమ్మ ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. మెగా బతుకమ్మఉత్సవాల సందర్భంగా ట్యాంకుబండ్ పై సరిపోయినంత గా లైటింగ్ ఏర్పాటు చేయాలని, అంతేకాక ట్యాంకుబండు ఈ చివరి నుండి ఆ చివరి వరకు వినిపించేలా పబ్లిక్ ఆర్డర్ సిస్టంఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్సవాలలో మహిళలే అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి వారికి తగిన రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ తో కోరారు. 
మెగా బతుకమ్మకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి

ట్యాంక్ బండ్ మొత్తం బ్యారికాడింగ్చేయాలని, డయాస్ ఏర్పాటు, ఇతర ఏర్పాట్ల విషయంలో ఏలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.మహా బతుకమ్మ ఉత్సవాల లో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు నల్ల చెరువు సమీపంలో గోపాల్పేట్ రోడ్డు నుండి ట్యాంకుబండ్ పై ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్దకుబతుకమ్మలతో ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో పాటు, జిల్లా పరిషత్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు,అధికారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. అనంతరం బతుకమ్మ ఉత్సవాన్ని ప్రారంభించిన తర్వాత మహిళలు బతుకమ్మలు ఆడతారని అనంతరం బతుకమ్మ ఘాట్వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.మెప్మా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు, జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది అందరూ తప్పకుండా మెగా బతుకమ్మ ఉత్సవాలుపాల్గొనాలని ఆమె ఆదేశించారు. రెండవ తేదీ ఒకవేళ వర్షం కురిసినట్లు అయితే చిట్యాల దారిలో ఉన్న స్టార్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా మహిళలకుఇబ్బంది కలగకుండా ఉండేందుకుగాను గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే మహిళలను సురక్షితంగా నల్ల చెరువు నుండి తరలించేందుకు అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయాలని ఆర్టిఓ ను ఆదేశించారు.జిల్లా ఎస్పీ అపూర్వ రావు మాట్లాడుతూ మహా బతుకమ్మ సంబరాల్లో భాగంగా నల్లచెరువు తో పాటు పట్టణంలో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలు పాల్గొని మహిళలకు పూర్తి భద్రత, కల్పిస్తామని ఇందుకుగాను ఎక్కువమంది మహిళా కానిస్టేబుల్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.