మేడారం జాతర ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మేడారం జాతర ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

హైదరాబాద్ అక్టోబర్ 1  (way2newstv.com)
ఫిబ్రవరి 5 నుండి 8వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్. కె.జోషి అధికారులను ఆదేశించారు. బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు.జాతరకు కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ తమకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు.
మేడారం జాతర ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

10 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. అడవులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలన్నారు. క్యూలైన్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసు శాఖ ద్వారా సీసీటీవీల ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ నిర్వహణను వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టాలన్నారు. సమాచార శాఖ ద్వారా మీడియా సెంటర్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.