హైద్రాబాద్, అక్టోబర్ 25 (way2newstv.com)
నగరాల్లో పొద్దున్నలేచింది మొదలు ఉరుకులు పరుగులు జీవితంతో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని చేధించుకుని ఆఫీసుకెళ్లి పనిచేయటం సిటిజన్లకు కత్తిమీదసాము లా తయారయ్యింది. తీరా ఇంత శ్రమ పడి వెళ్లాక బాస్ తిడితే పడటం ..పక్కనోడి ఈర్ష్యను భరించటం ...ప్రొఫెషనల్ జెలసీతో అభద్రత మధ్య ఉద్యోగం చేయటం... సెలవు కావాలంటే ఇబ్బంది పడుతూ అడగటం...దానికి ఎన్నో రూల్స్....ఇలాంటి ఎన్నో ఒత్తిళ్ల మధ్య సగటుజీవి నగర జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. ఇవన్నీ తట్టుకోలేని కొందరు తమ లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు. ఇంత కష్టపడి ఆ ఉద్యోగాలు చేయటం ఇష్టం లేని కొందరు తమకు వచ్చిన పని, నచ్చినప్పుడు ఇంట్లోనే కూర్చుని చేస్తున్నారు.
సిటీల్లో పెరుగుతున్న వర్క్ ఫ్రమ్ కల్చర్
తమకు తామే బాస్... ఇల్లే ఆఫీసు..ఇదే ఫ్రీ లాన్స్ జాబ్ ...నగరాల్లో ఇప్పుడు ఈ కల్చర్ పెరుగుతోంది.నగరాల్లో పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ ను చేధించుకుని గంటల కొద్దీ ప్రయాణం చేసి ఆఫీసులకు వెళ్లి అక్కడ 8 నుంచి 10 గంటల పాటు కంప్యూటర్ తో కుస్తీ పడటం ఎందుకని చాలామంది ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఖాళీ సమయాల్లో తమ హాబీకి, టాలెంట్‌కు తగిన ఉద్యోగాన్ని వెదికి పెట్టే వెబ్‌సైట్లు బోలెడు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఉద్యోగాలపై ఇప్పుడు సిటిజన్లు ఆసక్తి కనపరుస్తున్నారు. గృహిణులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వృత్తి నిపుణులు.. ఇలా ఒకరేంటి మహానగరంలో ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేస్తూ నెలకు 10 వేల రూపాయల నుంచి లక్షకు పైగా ఆర్జిస్తున్నవారు లక్ష మందికిపైగానే ఉన్నారని లెక్కలు చెపుతున్నాయి.ప్రధానంగా మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, ఐటీ అండ్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, ట్రావెల్ ఎక్స్‌పర్ట్, ఫుడ్ బ్లాగర్, ఇంటీరియర్ డిజైనింగ్, మొబైల్ యాప్ తయారీ, వెబ్‌సైట్ మేకప్ తదితర ఫ్రీలాన్స్ జాబ్స్‌తో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్ చేసుకునే అవకాశం ఉండటం ఈ ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాల ప్రత్యేకత.రెగ్యులర్ జాబ్ సైట్స్ షైన్, లింక్డిన్, ఇండీడ్ లాంటి సైట్స్ తో పాటు ఫ్రీలాన్స్ ఇండియా, ఆన్‌కాంట్రాక్ట్ , డిజైన్‌హిల్ లాంటి ఫ్రీలాన్స్ జాబ్ వెబ్‌సైట్లలో కూడా వేలాది మంది ఇలాంటి జాబ్స్ వెతుక్కుంటున్నారు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారు తమ ఫొటోలను కొన్ని వెబ్‌సైట్లలో పోస్టు చేసి తేలికగా వాటిని విక్రయించుకొని ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇక ప్రజలకు అవసరమైన సేవా రంగంలో కొత్త తరహా వెబ్ సైట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తున్నాయి. అర్బన్ క్లాప్ డాట్ కామ్ తదితర వెబ్ సైట్లు కూడా సర్వీసులు అందిస్తూనే ప్రొఫెషనల్స్‌కు జాబ్ అవకాశాలు అందిస్తుండటం చెప్పుకోతగ్గ విశేషం.మనదేశంలో ఫ్రీలాన్సర్స్ కు మంచి పార్ట్ టైమ్ జాబ్ లు ఆఫర్ చేస్తున్న వెబ్ సైట్ ఇదే. ఇది అమెరికాకు చెందిన జాబ్ వెబ్‌సైట్. ఇంటర్నేషనల్ వెబ్‌సైట్ కావడంతో వేతనం కూడా ఆ మేరకే ఉంటుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, రైటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లాంటి రంగాల్లో ఫ్రీలాన్స్ జాబ్స్‌ను వెతుక్కోవచ్చు. ఇందులో ఫ్రీగా మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫ్రీలాన్స్ వర్క్ మీరు చేస్తే ఆ మొత్తంలో కొంత అప్‌వర్క్ తీసుకొని మిగతా డబ్బు మీకు ఇస్తుంది.