ఇన్ స్టాల్ మెంట్ పేరుతో గోల్ మాల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇన్ స్టాల్ మెంట్ పేరుతో గోల్ మాల్

ముంబై, నవంబర్ 14,   (way2newstv.com)
భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు బంగారం డిమాండ్ రయ్ రయ్ మని పెరిగిపోతుంది. బంగారం ఒకేసారి కొనుగోలు చేసేవారే ఎక్కువ మంది ఉంటారు. అయితే కొంద మంది ప్రతి నెలా జువెలర్స్ వద్ద కొంత మొత్తం కట్టుకుంటూ ఏడాది చివరిలో దాచుకున్న ఆ డబ్బుతో ఒకేసారి బంగారం కొంటుంటారు.ప్రతి నెలా డబ్బు దాచుకుంటూ బంగారం కొనుగోలు చేసే వారిని లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు ఒకేసారి కట్టక్కర్లేదు.. ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో చిన్న మొత్తాల్లో ప్రతి నెలా చెల్లించండి.. బంగారాన్ని సొంతం చేసుకోండి.. అంటూ పేద, మధ్య తరగతి ప్రజలను వలలో వేసుకుంటున్నారు.
ఇన్ స్టాల్ మెంట్  పేరుతో  గోల్ మాల్

ముంబైలో ఒక జువెలరీ షాప్‌ డిపాజిట్ స్కీమ్ పేరుతో ఏకంగా రూ.300 కోట్లకు టోకరా వేసింది. ఈ జువెలరీ సంస్థ పేరు రసిక్‌లాల్ సంకల్‌చంద్ జ్యువెలరీ. జయేశ్ రసిక్‌లాల్ షా, నీలేశ్ రసిక్‌లాల్ షా బ్రదర్స్ ఘట్కేపర్ ప్రాంతంలో ఈ సంస్థను నడుపుతున్నారు. కొద్దికొద్దిగా డబ్బు డిపాజిట్ చేసుకుంటే.. ఆ డబ్బుతో ఒకేసారి బంగారం కొనుగోలు చేయవచ్చని కస్టమర్లకు ఆశ చూపారు.రసిల్‌లాక్ జువెలరీ సంస్థ ఈ విధంగా కొన్ని వందల మంది నుంచి ఏకంగా రూ.300 కోట్ల డిపాజిట్లు సేకరించింది. ఇలా డబ్బు దాచుకున్న వారందరికీ ఒకేసారి కుచ్చుటోపి పెట్టింది ఆ సంస్థ. బోర్డు తిప్పేసింది. దాచుకున్న డబ్బుతో బంగారం కొందామని ఆ గోల్డ్ షాప్‌కు వచ్చిన కస్టమర్లు షాక్‌కు గురయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన కస్టమరర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారుముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది పొంజీ స్కీమ్ మోసం కావడంతో ముంబై ఎకనమిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి రసిక్‌లాల్ బ్రదర్స్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ రసిక్‌లాక్ జువెలరీ సంస్థ గత ఆరు నెలలుగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వకపోవడం గమనార్హం