మళ్లీ పురివిప్పుతున్న ర్యాగింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ పురివిప్పుతున్న ర్యాగింగ్

హైద్రాబాద్, నవంబర్ 12, (way2newstv.com)
జెఎన్‌టియూలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ర్యాగింగ్ చేశారని ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినందుకు తనను డిటేయిన్ చేశారని ఇంజనీరింగ్ విద్యార్థి బుధవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నంచడంతో సంచలనం సృస్టించింది. కూకట్‌పల్లిలోని జెఎన్‌టియూలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వర్షిత్, నవీన్, రోహిత్ కళ్యాణ్‌ను పదిహేను రోజుల క్రితం ఫైనల్ ఇయర్ విద్యార్థి అనిల్ రాజ్ ర్యాగింగ్ చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులను అనిల్‌రాజ్ ర్యాగింగ్ చేశాడని ఫైనల్ ఇయార్ విద్యార్థి సందీప్(మెటలర్జీ) ప్రిన్సిపాల్ సాయిబాబా రెడ్డికి ఫిర్యాదు చేశాడు. చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షల సమీపిస్తుండడంతో ప్రతి ఏడాది లాగే విద్యార్థుల హాజరు శాతాన్ని తెప్పించుకున్నారు.అందులో సందీప్‌కు హాజరు తక్కువ ఉండడంతో ప్రిన్సిపాల్ డిటేయిన్ చేశాడు. 
మళ్లీ పురివిప్పుతున్న ర్యాగింగ్

ర్యాగింగ్ చేసిన వారిపై చర్యల తీసుకోకుండా ఫిర్యాదు చేసినందుకే తనను డిటేయిన్ చేశారని మనస్థాపం చెంది ప్రిన్సిపాల్ కార్యాలయంలోనే మద్యాహ్నాం 3.30 పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడ ఉన్న వారు అడ్డుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చికిత్స కోసం సందీప్‌ను ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు విద్యార్థి సంఘాలు జెఎన్‌టియూ ఎదుట ధర్నా చేశారు. ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేసిన విద్యార్థిని డిటేయిన్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.జెఎన్‌టియూలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని ప్రిన్సిపాల్ సాయిబాబా రెడ్డి స్పష్టం చేశారు. నాలుగో ఏడాది చదువుతున్న సందీప్‌కు హాజరు 55శాతం మాత్రమే ఉందని, అందుకే డిటేయిన్ చేశామని తెలిపారు. మెడికల్ కింద 10శాతం మినహాయింపు మాత్రమే ఉంటుందని అయినా కూడా సందీప్‌కు తక్కువగా హాజరు శాతం ఉందని తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు సెకండ్ షో సినిమాకు వెళ్లి వస్తుండగా క్యాంపస్‌లో ఉన్న ఫైనల్ ఇయార్ విద్యార్థులు ఎక్కడికి వెళ్లి వస్తున్నారని ప్రశ్నించారి ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవజరిగిందని తెలిపారుమరుసటి రోజు వారు మిగతా వారికి చెప్పడంతో ప్రథమ, ఫైనల్ ఇయర్ విద్యార్థులు కొట్టుకున్నారని తెలిపారు. దీనిపై విచారణ కమిటీని కూడా నియమించామని తెలిపారు. దానిని సందీప్ తనకు అనుకూలంగా మలచుకుంటున్నాడని క్యాంపస్‌లో ర్యాగింగ్ జరగలేదని స్పష్టం చేశారు. డిటెన్షన్ తన పరిధిలోనిది కాదని ఈసి బాడి చూసుకుంటుందని తెలిపారు. తనకు హాజరు శాతం తక్కువగా ఉందని కలపాలని మెటలర్జి హెచ్‌ఓడిని కూడా బెదిరించాడని ఆరోపించారు.తర్వాత మరొక నివేదికను హెచ్‌ఓడి సమర్పించారని తెలిపారు. కమిటీ మొదలు సమర్పించిన దానిని పరిగణలోకి తీసుకుని డిటేయిన్ చేసిందని తెలిపారు. హాజరు తక్కువగా ఉన్న 25మంది విద్యార్థులను డిటేయిన్ చేశామని చెప్పారు.