హర్షకుమార్ కిం కర్తవ్యం... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హర్షకుమార్ కిం కర్తవ్యం...

కాకినాడ, డిసెంబర్ 2, (way2newstv.com)
కాంగ్రెస్ మాజీ నేత‌, అమ‌లాపురం మాజీ ఎంపీ హ‌ర్షకుమార్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. రాజ‌కీయంగా ఆయనకు ఎటూ దారి క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌లో ఉండ‌గా వైఎస్ ఆశీర్వాదంతో అమ‌లాపురం టికెట్ తెచ్చుకున్న ఆయ‌న విజ‌యంసాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ద‌ళిత వ‌ర్గానికి చెందిన నాయకుడిగా కూడా బ‌ల‌మైన గుర్తింపు సాధించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న‌తో హ‌ర్షకుమార్ కాంగ్రెస్‌కు దూర‌మయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ఆహ్వానం అందినా మౌనంగా ఉండిపోయారు. ఇక‌, దీనికి ముందు ఆయ‌న కాంగ్రెస్‌లో త‌నే చ‌క్రం తిప్పాల‌ని భావించారు వైఎస్‌తో ఘ‌ర్షణ‌కు దిగారు.త‌న‌కు కోరి కోరిటికెట్ ఇప్పించార‌నే విశ్వాసం కూడా చూపించ‌కుండా వైఎస్‌తోనే హ‌ర్షకుమార్ ఘ‌ర్షణ‌ప‌డ్డారు. ఈ క్రమంలోనే 2009లో ఆయ‌న టికెట్ ఇవ్వద్దంటూ వైఎస్ కాంగ్రెస్ అధిష్టానికి చెప్పారు. 
హర్షకుమార్ కిం కర్తవ్యం...

అయితే, సిట్టింగుల‌ను మార్చొద్దంటూ పార్టీ హైక‌మాండ్ ఆదేశించ‌డంతో రెండో సారి కూడా హ‌ర్షకుమార్ పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇక‌, వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత కాంగ్రెస్‌లో చేల‌రేగినా రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో హ‌ర్షకుమార్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. కొన్ని రోజులు కిర‌ణ్‌కుమార్ పెట్టిన స‌మైక్యాంధ్ర పార్టీలో ఉన్నారు. ఇక‌, దాని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. మ‌ళ్లీ ఏదో ఒక పార్టీలో చేరాల‌ని ప్రయ‌త్నించారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ఆహ్వానం అందింది.అయితే, ఆ పార్టీ అధికారంలో లేకపోవ‌డంతో హ‌ర్షకుమార్ మౌనం పాటించారు. ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరాల‌ని ప్రయ‌త్నించారు. చంద్రబాబును వేనోళ్ల కొనియాడారు. ఈ క్రమంలోనే అమ‌లాపురం ఎంపీ సీటు కోసం ప్రయ‌త్నించారు. అయితే, ఇక్కడ దివంగ‌త బాల‌యోగి కుమారుడుకి చంద్రబాబు టికెట్ ఇస్తున్నార‌ని తెలియ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చి .. వైసీపీలోకి వెళ్లాల‌ని నిర్ణయించుకు న్నారు. అయితే, అప్పటికే వైసీపీ ఆఫ‌ర్‌ను తోసిపుచ్చడంలో జ‌గ‌న్ కూడా ద‌గ్గర‌కు చేర‌నివ్వలేదు. దీంతో హ‌ర్షకుమార్ ప‌రిస్థితి రెండికీ చెడ్డ రేవ‌డిగా మారిపోయింది. అయితే ఈ యేడాది ఎన్నిక‌ల్లో చివ‌ర్లో వైసీపీకి స‌పోర్ట్ మాత్రం చేశాడు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ జ‌గ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుని తీవ్రంగా విమ‌ర్శలు చేస్తున్నారు.ఇక‌, హ‌ర్షకుమార్ ప‌రిస్థితి ఎవ‌రినీ న‌మ్మడ‌నే పేరుంది. వాస్తవానికి రాజ‌కీయాల్లో ఉన్న వారు పార్టీ అధినేత‌ను ఖ‌చ్చితంగా న‌మ్మాలి. మంచో చెడో ఏదొ ఒక‌ర‌కంగా అధినేత చుట్టూనే తిరిగాలి. కానీ, ఈయ‌న ఎవ‌రినీ న‌మ్మడు. సో. ఇది మైన‌స్‌గా మారిపోయింది. కేవ‌లం త‌న ఇమేజ్‌తోనే తాను గెలుస్తాన‌న్న భావ‌న ఆయ‌న‌లో ఎక్కువుగా ఉంటుంద‌న్నది రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపించే మాట‌. హ‌ర్షకుమార్ వైసీపీలో ఉండి ఉంటే.. వైసీపీ ఎంపీగా గెలుపు గుర్రం ఎక్కేవారు. ఇప్పుడు జ‌గ‌న్‌తోనూ ఘ‌ర్షణ పెట్టుకున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆయ‌న‌ను ఎవ‌రూ ఏ పార్టీలోకీ ఆహ్వానించే ప‌రిస్థితి లేదు. వ‌చ్చే ఐదేళ్లు కూడా త‌ట‌స్థంగా ఉండిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. పైగా కేసులు కూడా న‌మోదైన నేప‌థ్యంలో ఇప్పుడు జ‌గ‌న్‌ను విమ‌ర్శించినా.. ప్రయోజ‌నం లేదు. సో.. మొత్తానికి హ‌ర్షకుమార్ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.