ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించిన కిషన్ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించిన కిషన్ రెడ్డి

హైద్రాబాద్, నవంబర్ 30, (way2newstv.com)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితుకుల ఉరి శిక్ష పడేలా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు.
ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించిన కిషన్ రెడ్డి

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలంలో రూపొందించిన చట్టాలకు త్వరలోనే మార్పులు చేయబోతున్నట్టు తెలిపారుబాధితులకు సత్వర న్యాయ పరిష్కారం లభించే విధంగా ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో మార్పులు తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు. చాలా కేసుల్లో ట్రయల్ కోర్టులు విధించిన తీర్పులను హైకోర్టులో సవాల్ చేస్తున్నారని.. ఇకనుంచి అలాంటి ప్రక్రియ లేకుండా చేస్తామని అన్నారు. ట్రయల్ కోర్టులో విధించిన తీర్పును మధ్యలో మరో కోర్టులో సవాల్ చేసే అవకాశం లేకుండా ఏకంగా సుప్రీంకోర్టులోనే తేల్చుకునేలా చట్టాలను మారుస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై లోక్‌సభలో కూడా ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. అలాగే మహిళల రక్షణ కోసం112 ప్రత్యేక యాప్‌లను రూపొందించామని, ప్రతీ మహిళా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు