నేతల బూతులపై జగన్ అంతర్మధనం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నేతల బూతులపై జగన్ అంతర్మధనం

విజయవాడ, డిసెంబర్ 2, (way2newstv.com)
తెలుగుదేశం సర్కార్ ఎక్కడ ఓడిందంటే ఇలాగే అనవసరంగా మాట్లాడడం వల్లనేనని అంటారు. అప్పట్లో బాబు క్యాబినేట్లో ఉన్న కొందరు మంత్రులు నోటి దురుసుతో చేసిన కామెంట్స్ జనంలోకి వెళ్ళి పూర్తి వ్యతిరేకతను తెచ్చాయి. దాని వల్ల మొత్తం పార్టీకే చెడ్డపేరు వచ్చింది. ఒక టీడీపీ ఎమ్మెల్యే నాడు అసెంబ్లీలోనే  పాతేస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యేలను  హెచ్చరించడం కూడా చర్చనీయాంశమైంది. ఇక ఇపుడు అదే తీరులో వైసీపీలో కొందరి మంత్రుల పోకడలు ఉంటున్నాయి. కొడాలి నాని ఈ బూతుల జాబితాలో ముందు వరసలో ఉన్నారు. ఆయన మాట్లాడిటే అలవొకగా బూతులు వచ్చేస్తున్నాయి. వాటిలో చాలావరకూ మీడియాలో ప్రసారం కూడా చేయడానికి అభ్యంతరంగా ఉంటోందంటేనే భాష తీరు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 
నేతల బూతులపై జగన్ అంతర్మధనం

ఇక మరో మంత్రి అనిల్ కుమర్ యాదవ్ కూడా అంతే. ఆయనకు ఆవేశం ఎక్కువ. ఆ సమయంలో నోటికి ఏది వస్తే అదే అనేస్తారు.వీరికి తోడు ఇపుడు పెద్దాయన స్పీకర్ తమ్మినేని సీతారాం తోడు అయ్యారు. సహజంగానే సీతారాం కి ఆవేశం పాలు ఎక్కువ. అయితే జగన్ ఆయన తొలి నుంచి పార్టీని నమ్ముకుని  ఉన్నారని మంత్రి పదవి సర్దలేక గౌరవనీయమైన స్పీకర్ పదవి ఇచ్చారు. అయితే ఈ పదవిలో ఉన్నవారు సహజంగా తక్కువ మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడినా భాష జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే తమ్మినేని సీతారాం ఆవేశంతో చేస్తున్న కొన్ని కామెంట్స్ పెద్ద  దుమారం రేపుతున్నాయని అంటున్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాశం అయ్యాయి. ఇక తాజాగా సోనియాగాంధీ మీద కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ మహిళా నేతలు ఆక్షేపణ తెలిపారు. ఇటీవల జ్యోతీరావు ఫూలే కార్యక్రమంలో  శ్రీకాకుళంలో స్పీకర్ పాల్గొంటూ ఉద్యోగులపైన చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఆ వర్గం  నొచ్చుకునేలా ఉన్నాయని అంటున్నారు.మంత్రుల విషయంలోనే జగన్ జాగ్రత్తలు చెబుతున్నా తరచూ  వారు బోర్డర్ దాటేస్తున్నారు. ఒకటికి రెండు సార్లు క్లాస్ తీసుకున్న కారణంగా కొందరు మంత్రులు గతం కంటే దూకుడు తగ్గించారని అంటున్నారు. ఇక ఈ తలనొప్పి ఇలా ఉండగానే స్పీకర్ జోరు చేయడంపైన సొంత పార్టీలోనే చర్చ సాగుతోందట. జగన్ సైతం దీని మీద ఏం చేయాలని ఆలోచిస్తున్నారుట. స్పీకర్ అంతటి వారికి చెప్పి చూడడం అంటే ఎలా అని జగన్ మధనపడుతున్నరని టాక్. ఇక శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మానని డమ్మీని చేసి మరీ స్పీకర్ జోరు చేయడం పట్ల ఇప్పటికే పార్టీలోని ఒక వర్గం ఫిర్యాదులు ఉన్నాయని అంటున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు కొంత వరకూ పరిధిలు దాటకుండా ఉండాలి, మరి స్పీకర్ తాను ముందు ఎమ్మెల్యే తరువాతనే ఏదైనా అంటున్నారు. ఆయనతో సహా పార్టీ నేతల బూతు పురాణం ఇపుడు వైసీపీలో పెద్ద చర్చగా ఉంది. మరి చూడాలి జగన్ ఎలా చక్కదిద్దుతారో