వైసీపీలో కుమ్ములాటలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీలో కుమ్ములాటలు

విశాఖపట్టణం, డిసెంబర్ 2, (way2newstv.com)
వైసీపీ ఎమ్మెల్యేల్లో కుమ్ములాట‌లు జ‌రుగుతున్నాయి. కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నవారు.. త‌మ ఆధిప‌త్యం చలాయించుకునేందుకు పోటీ ప‌డుతుండ‌గా.. పార్టీ కోసం మేం కూడా ఎంతో త్యాగాలు చేశామ‌ని, మ‌మ్మల్ని త‌క్కువ‌గా చూస్తారా ? అంటూ మిగిలిన నాయ‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో గుంటూరు, విజ‌య‌న‌గ‌రం, క‌ర్నూ లు, ప్రకాశం జిల్లాల్లో నాయ‌కుల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. విజ‌య‌న‌గ‌రంలో మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ వ‌ర్గం అంతా తామై వ్యవ‌హ‌రిస్తోంది. ఇక్క‌డ కీల‌క‌మైన నాయ‌కుడు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామికి వ్యతిరేకంగా చ‌క్రం తిప్పుతున్నారు. అయితే, ఈయ‌న పార్టీకి అత్యంత విధేయుడినైన నాకే ఏమీ చెప్పకుండా లెక్క చేయ కుండా వ్యవ‌హ‌రిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలో కుమ్ములాటలు

ఒక్క కోలగట్ల మాత్రమే కాదు జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ ఒంటెద్దు పోక‌డ‌ల‌పై పైకి చెప్పుకోక‌పోయినా తీవ్రంగా ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఇక‌, గుంటూరు నాయ‌కుల విష‌యాన్ని కొత్తగా చెప్పాల్సిన ప‌నిలేదు. విడ‌ద‌ల ర‌జ‌నీ వ‌ర్సెస్ ఎంపీ లావు, ఎమ్మెల్యేలు ర‌జ‌నీ వ‌ర్సెస్‌ శ్రీదేవి మ‌ధ్య ప్రత్యర్థుల‌ను మించిపోయిన పోరాటం ర‌గులుతోంది. అలాగే బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌కు ఎమ్మెల్యే శ్రీదేవికి కూడా ప‌డ‌డం లేదు. ఇక‌, హోంమంత్రి సుచ‌రిత ఎవ‌రినీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుని పోతూ.. కింది స్థాయి నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానే శారు. దీంతో ఆమెపై కింది స్థాయి నాయ‌కులు ఆగ్రహంతో ఉన్నారు. ఇక‌, సీనియ‌ర్ నాయ‌కులు ఈ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ కోసం త్యాగం చేసినా.. వారికి ఇప్పుడు ఎలాంటి గుర్తింపూ లేకపోగా.. ఎమ్మెల్యేల నుంచి కూడా ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. దీంతో ఈ జిల్లా ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అంటున్నారు.ఇక‌, ప్రకాశంలో ఓ ఇద్దరు నాయ‌కులు మాత్రమే చ‌క్రం తిప్పుతుండ‌డం ఇక్కడి నాయ‌కులకు మింగుడు ప‌డ‌డం లేదు. వీరిలో ఒక‌రు మంత్రి బాలినేని కాగా, మ‌రొక‌రు టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి. ఈ ఇద్దరి ఆధిప‌త్య పోరులో జిల్లా పార్టీ నేత‌లు న‌లిగిపోతున్నారు. ఇక్క‌డ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డిని ఎవ్వరూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఇక‌, పార్టీలో ఓడిపోయిన నాయ‌కులు ఒక‌రు.. ఓడినా పైచే యి నాదే అని ప్రచారం చేసుకోవ‌డం, పార్టీ కూడా ఆ నేత‌కు అనుకూలంగా ఉండ‌డం, ఆయ‌న ఏం చేసినా ప్రశ్నించేవారు లేక పోవ‌డంతో ప్రకాశంలో పార్టీ నుంచి గెలిచిన నాయ‌కులు గుస్సాగానే ఉన్నారు. త‌మ‌కు ఏమాత్రం విలువ ఇవ్వరా అంటూ.. ఇటీవ‌ల జిల్లా ఇంచార్జ్ మంత్రిని నిల‌దీసిన‌ట్టు తెలిసింది.ఇక‌, క‌ర్నూలులోనూ అధికార పార్టీ నాయ‌కులు మౌనం పాటిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు విప‌క్ష నాయ‌కుల దే పైచేయిగా ఉండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి విప‌క్ష నాయ‌కులు ఏదైనా విమ‌ర్శ చేస్తే.. దానిని ఖండించ‌డ మో.. లేక‌.. కౌంట‌ర్ ఇవ్వడ‌మో చేయాలి. కానీ, ఇక్కడ త‌మ‌కు ఎలాంటి గుర్తింపు లేద‌ని భావిస్తున్న గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మౌనం పాటిస్తుండ‌డం గ‌మ‌నార్హం. జిల్లాలో వైసీపీ టోట‌ల్‌గా క్లీన్‌స్వీప్ చేసినా ఆ జోష్ క‌న‌ప‌డ‌డం లేదు. క‌ర్నూలులో ఎమ్మెల్యే హ‌పీజ్‌ఖాన్ వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహ‌న్‌రెడ్డి, కోడుమూరులో ఎమ్మెల్యే సుధాక‌ర్‌బాబు వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే ముర‌ళీకృష్ణ, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ వ‌ర్సెస్ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌రెడ్డి మ‌ధ్య తీవ్రమైన వార్ న‌డుస్తోంది. దీంతో ఈ నాలుగు జిల్లాల్లోనూ అధికార పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ కానీ, ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుని పార్టీని ముందుకు న‌డిపిస్తారో ? చూడాలి.