దిశ’ ఘటనపై కేంద్రం తాజా ప్రకటన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దిశ’ ఘటనపై కేంద్రం తాజా ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబర్ 2 (way2newstv.com)
షాద్నగర్లో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను పార్టీలకతీతంగా ఎంపీలంతా లోక్సభ సాక్షిగా ముక్తకంఠంతో ఖండించారు. ‘దిశ’ ఘటనను పార్టీలకతీతంగా ఖండించాలని లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అన్ని పార్టీలు అంగీకరిస్తే చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమని రాజ్నాథ్ ప్రకటించారు.
దిశ’ ఘటనపై కేంద్రం తాజా ప్రకటన

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఘటనపై స్పందించారు. దిశ ఘటనపై దిగ్భ్రాంతి చెందానని, పోలీసులు ఇలాంటి ఘటనల్లో చురుగ్గా పనిచేయాలని ఆయన సూచించారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై కేంద్రం సీరియస్గా ఉందని, కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు.