హైదరాబాద్ డిసెంబర్ 27(way2newstv.com)
నగరంలోని హెచ్‌ఐసీసీలో 34వ భారతీయ ఇంజినీరింగ్ కాంగ్రెస్ సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పేదల బతుకులు మార్చేందుకు సాంకేతికత ఉపయోగపడాలన్నారు.
కృత్రిమ మేధతో ఇంజినీర్లు తమ పనితీరుకు పదునుపెట్టాలి: గవర్నర్
కృత్రిమ మేధతో ఇంజినీర్లు తమ ప్రతిభ, పనితీరుకు పదునుపెట్టాలి. ఇంజినీరింగ్ కృషి దేశాభివృద్ధికి దోహదపడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్ కృషి అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్.