విజయవాడ, డిసెంబర్ 27, (way2newstv.com)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైన పథకానికి నూతన జవసత్వాలు నింపే దిశగా నేడు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయంతండ్రి చూపిన బాటలోనే నడుస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకానికి కొత్త ఊపిరిలూదారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా నాడు వైఎస్ ప్రారంభించిన 108 పథకానికి నూతన జవసత్వాలు నింపే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతన అంబులెన్సుల కొనుగోలుకు పచ్చజెండా ఊపారు.అమరావతి సచివాలయంలో ఆ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడారు.
108 పథకానికి జవసత్త్వాలు
నూతనంగా 108, 104 వాహనాల కొనుగోలుకు అనుమతులు మంజూరు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేసినట్లు చెప్పారు. అందులో భాగంగా 412 కొత్త 108 అంబులెన్సులు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. అందుకోసం 71.48 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు ప్రవేశపెట్టిన 104 వాహనాల కొనుగోలు చేసేందుకు క్యాబినెట్ ఆమెదం తెలిపిందన్నారు. మొత్తం 656 నూతన 104 వాహనాల కొనుగోలుకు 60.51 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. మార్చి 31 లోపు వాహనాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులను రక్షించేందుకు నాడు వైఎస్ 108 అంబులెన్సులను ప్రవేశపెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్ చేస్తే నిమిషాల వ్యవధిలో 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించేవారు. వేగంగా సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు పోకుండా కాపాడేవారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పలు రాష్ట్రాలు 108 సర్వీసులను ప్రారంభించాయి.