తెలంగాణ విత్తనానికి ప్రత్యేకత వుంది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ విత్తనానికి ప్రత్యేకత వుంది

హైదరాబాద్ డిసెంబర్ 21 (way2newstv.com):
ఫ్యాప్సీలో  తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాటుచేసిన మహిళా సాహితీవేత్తలకు విత్తన అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ 10 వేల ఏళ్ల క్రితమే వ్యవసాయం మొదలయింది.  నాగలి (హలం) నుండి వ్యవసాయ నాగరికత పుట్టుకొచ్చింది.  అటువంటి నాగలికి పుట్టినిల్లు అలంపురం.  ఆ హలంపురం నేడు అలంపురంగా బాసిల్లుతుంది.  వ్యవసాయం దండగ అంటే మానవజాతి మనుగడే దండగ అన్నట్లని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్  మార్గదర్శనంలో వ్యవసాయం పండగ చేసే పనిలో ఉన్నాం.జన బాహుళ్యం అంతా ఎవరికి వారు తమ పనిలో, వృత్తులలో నిమగ్నమవ్వాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.  మన తెలంగాణ విత్తనానికి ప్రత్యేకత ఉంది.  
తెలంగాణ విత్తనానికి ప్రత్యేకత వుంది

అది ఈ ప్రాంతం, ఈ నేలలకే సొంతం.  మన దగ్గర తయారయిన విత్తనం ప్రపంచంలో ఎక్కడయినా మొలకెత్తుతుంది.  అందుకే తెలంగాణ విత్తన భాండాగారం అయిందని అన్నారు.  దాదాపు 400 కంపెనీలు 5 వేల కోట్ల విత్తన వ్యాపారం చేస్తున్నాయి.  విత్తన సదస్సుతో అన్నివిధాల ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను.   తెలంగాణ ప్రభుత్వం దాదాపు 65,70 వేల కోట్లు వ్యవసాయంపై ఖర్చు చేస్తుంది .  నాలుగుకోట్ల తెలంగాణ రాష్ట్రం ఇంత ఖర్చు చేస్తుంటే .. 18 కోట్ల జనాభా ఉన్న యూపీ రాష్ట్రంలో కనీసం పదివేల కోట్లు కూడా ఖర్చుచేయడం లేదు ఎన్నో సభలలో పాల్గొన్నానని అన్నారు.  ఇది శిఖరాగ్ర సభగా అనిపిస్తుంది.  దేశమంతా అవసరం లేని అంశాల మీద చర్చ జరుగుతున్నది.  తెలంగాణలో దానికి భిన్నంగా సమాజానికి ఉపయోగపడే, భవిష్యత్ కు బాటలు వేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ఫ్యాప్సీలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాటుచేసిన మహిళా సాహితీవేత్తలకు విత్తన అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి,  విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు