తుగ్గలి డిసెంబర్ 21 (way2newstv.com):
తుగ్గలి మండలంలోని గుత్తి ఎర్రగుడి గ్రామంలో గల సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను సచివాలయ ఉద్యోగులు,పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్,ఏఎన్ఎం,ఆశ వర్కరులు గ్రామ వాలంటీర్లు కేకు కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జయంతి వేడుకలు
అనంతరం పాఠశాలలోని పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ సచివాలయ మరియు వాలంటీర్ల వ్యవస్థలను తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగేంద్ర నాయక్,నాగలక్ష్మి ,మధు,వాలంటీర్ లు లక్ష్మీ నారాయణమ్మ, నాగమణి, వెంకటేశ్వర రెడ్డి, విజయ్,రంగనాయకులు,లక్ష్మా నాయక్,ఈస్రా నాయక్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.